లైంగిక దాడి ఆరోపణలపై స్వామీజీ అరెస్ట్‌ | Self Styled Godman Ashu Maharaj Arrested In Rape Case | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి ఆరోపణలపై స్వామీజీ అరెస్ట్‌

Sep 14 2018 8:32 AM | Updated on Sep 14 2018 8:32 AM

Self Styled Godman Ashu Maharaj Arrested In Rape Case - Sakshi

తల్లీకూతుళ్లను వేధించిన నకిలీ స్వామీజీని కటకటాల వెనక్కు నెట్టిన ఖాకీలు..

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో లైంగిక దాడి ఆరోపణలపై వివాదాస్పద స్వామీజీ ఆషు మహరాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హజ్‌ఖాస్‌ ఆశ్రమంలో ఓ మహిళ, ఆమె మైనర్‌ కుమార్తెపై ఆషు మహరాజ్‌ లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఆయన కుమారుడు సమర్‌ ఖాన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ రాజీవ్‌ రంజన్‌ చెప్పారు.

ఆషు మహరాజ్‌పై కీలక ఆధారాలు లభ్యం కావడంతో ఆయనను అరెస్ట్‌ చేశామని పోలీసులు చెప్పారు. కేసుకు సంబంధించి నిందితులిద్దరినీ ప్రశ్నించామన్నారు. కాగా 2008 నుంచి 2013 వరకూ స్వామీజీ, ఆయన స్నేహితులు, కుమారుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, తర్వాత తన మైనర్‌ కుమార్తెపైనా లైంగిక దాడి జరిపారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు.

సెప్టెంబర్‌ 10న హజ్‌ఖాస్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవగా, అనంతరం ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు బదలాయించారు. నిందితులపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, మైనర్‌ బాలికను లైంగికంగా వేధించడంతో పాటు హతమారుస్తానని బెదిరించిన నకిలీ బాబా నబ్బేదాస్‌ను ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement