'గిప్పటికి దొరికిండు' దొంగ రాజు

Seizing Raja Arrest In Chittoor - Sakshi

మిస్టరీని   చేధించిన చిత్తూరు పోలీసులు

జంట హత్యల నిందితుడు సీజింగ్‌ రాజా అరెస్టు

విచారణలో ఆశ్చర్యకర విషయాలు

సాక్షి, చిత్తూరు : ఇటీవల గుడిపాల మండలంలో జరిగిన జంట హత్యల కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. చివరకు సీజింగ్‌ రాజాను చిత్తూరు జిల్లా పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. సీజింగ్‌ రాజా చెన్నై తాంబరం ప్రాంతానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. తమిళనాడులో సీజింగ్‌ రాజా పేరు చెబితే అక్కడి వాసులకు వణుకే. అయితే జంట హత్యల కేసుతో పాటు న్యాయస్థానాన్ని, పోలీసుల దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి యత్నించడం కింద రాజాపై చిత్తూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. సీజింగ్‌ రాజా తమిళనాడులో సెటిల్ మెంట్ల ద్వారా వందల కోట్లు ఆర్జించాడు. ఈయనపై చెన్నై నగరంలో 33 కేసులు ఉన్నాయి.

హత్యా , దోపిడి , హత్యాయత్నం , కిడ్నాప్ కేసులే అధికం. తమిళనాడు పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన సీజింగ్ రాజాపై భారీ ఎత్తున కేసులున్నాయి. మే 10వ తేదీన గుడిపాల మండలంలో జాతీయ రహదారి పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.

సినీ ఫక్కీలో అసలైన నిందితుడు సీజింగ్ రాజా బదులు పోలీసుల కన్నుకప్పడానికి చిత్తూరు కోర్టులో ఐదుగురు డూప్లికేట్ నిందితులు లొంగిపోయాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అదుపులో తీసుకుని అసలు నిందితుడైన సీజింగ్ రాజాను అరెస్ట్ చేయడానికి మూడు టీంలుగా విడిపోయి తమిళనాడులోని సీజింగ్ రాజా కదలికలపై నిఘా ఉంచి అరెస్టు చేశారు, పోలీసుల విచారణలో అతని గురించి  ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top