బాయ్‌ఫ్రెండ్‌ను ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో పెట్టింది..

Russia Woman killed and stored boy friend body parts in freezer - Sakshi

బాయ్‌ ఫ్రెండ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన యువతి

మాంసం దుకాణంలో చేసినట్లు లవర్‌ శరీర భాగాలను ఇంట్లో వేలాడదీత

మర్మాంగాలతో పాటు తల, కాళ్లు, చేతులు, చెంపలను కిచెన్‌ కత్తితో కోసినట్లు నిర్ధారించిన పోలీసులు

మాస్కో, రష్యా : బాయ్‌ ఫ్రెండ్‌ అత్యంత క్రూరంగా హత్య చేసిన అనస్తేసియా ఒనేజినా(21)ను రష్యా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అనస్తేసియా వెల్లడించిన వివరాలు విని పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు.

బాయ్‌ ఫ్రెండ్‌ డ్మిటీ సింకీచ్‌(24)ను అనస్తేసియా హత్య చేసిన తీరు పోలీసులను గగుర్పాటుకు గురి చేసింది. సింకీచ్‌ కొన్నేళ్ల పాటు పోలీసుగా పని చేసి వ్యక్తిగత కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనస్తేసియా, సింకీచ్‌లు కొద్ది ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో వేలెంటైన్స్‌ డే సందర్భంగా సింకీచ్‌ ఇంటికి వచ్చిన అనస్తేసియా సింకీచ్‌ను కిరాతకంగా చంపింది. కిచెన్‌ కత్తితో సింకీచ్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపింది. అనంతరం బాడీ నుంచి తల, కాళ్లు, చేతులు, మర్మాంగం, చెంపలు వేరు చేసినట్లు చెప్పింది.

హత్య జరిగిన ప్రదేశంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇంట్లో హుక్స్‌కు వేలాడుతున్న సింకీచ్‌ శరీర భాగాలను చూసి కంగుతిన్నారు. ఫ్రిజ్‌లో ప్యాకెట్ల రూపంలో సింకిచ్‌ ప్రైవేట్‌ పార్ట్స్‌ను అనస్తేసియా దాచినట్లు చెప్పారు. అనస్తేసియాకు గతంలోనే వివాహమైంది. పెళ్లైనా కొద్దిరోజులకే అనస్తేసియా భర్త అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.

Back to Top