పాత కక్షలతోనే రౌడీషీటర్‌ హత్య! | Rowdy Sheeter murdered with old issues! | Sakshi
Sakshi News home page

పాత కక్షలతోనే రౌడీషీటర్‌ హత్య!

Oct 31 2017 1:37 AM | Updated on Oct 31 2017 1:37 AM

Rowdy Sheeter murdered with old issues!

సీసీ టీవీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యం. ఇన్‌సెట్‌లో వాసు(ఫైల్‌)

సాక్షి గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గుంటూరు రౌడీషీటర్‌ బసవల వాసు హత్య కేసును గుంటూరు అర్బన్‌ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను సోమవారం రాత్రి అరెస్టు చేశారు. గుంటూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం రాత్రి విలేకర్ల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ విజయారావు వివరాలు వెల్లడించారు.

ఓ గొడవలో గుంటూరులోని సంగడిగుంటకు చెందిన చక్రకోటి సాయి, బాలాజీ నగర్‌కు చెందిన సింగంశెట్టి సతీష్‌లపై గతంలో వాసు దాడికి పాల్పడ్డాడు. దీన్ని మనసులో ఉంచుకున్న సతీష్‌ తన మిత్రుడైన రౌడీషీటర్‌ కావటి రాజేష్‌తో పాటు ఎస్‌.కె.ఆదాం, ఎస్‌.కె.సులేమాన్, గట్టుపల్లి శివరామకృష్ణలతో కలిసి ఆదివారం రాత్రి వాసును దారుణంగా హత్య చేసి పారిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement