రోహిత్‌ తివారీ హత్య; అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

Rohit Shekhar Murder Wife Named In Charge Sheet - Sakshi

ఢిల్లీ: దివంగత గవర్నర్‌, యూపీ మాజీ సీఏం ఎన్‌డీ తివారీ తనయుడు రోహిత్‌ తివారి హత్య కేసులో నిందితురాలు అయిన అతడి భార్య అపూర్వ శుక్లాపై పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో అపూర్వ రోహిత్‌ను ఊపిరాడకుండా చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె జైలు జీవితం గడుపుతున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు మంగళవారం ఆమెపై  518 పేజీల చార్జీ షీట్‌ దాఖలు చేశారు.

చదవండి : ఆమె వీడియో కాల్ వల్లే ఇదంతా...నిందితురాలిగా సుప్రీంకోర్టు లాయర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top