
లుధియానా : పంజాబ్‌లో రిపబ్లిక్ డే నాడే విషాదం చోటుచేసుకుంది. జెండా ఆవిష్కరణ జరుగుతుండాగానే ఓ పోలీస్ గన్‌మెన్ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జార్గాన్ పట్టణంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. జార్గాన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు డ్రైవర్ కమ్ గన్‌మెన్‌గా వ్యవహరించే మంజీత్ రామ్ తన ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకుని బలవన్మరణం పొందాడు.
వేడుకలు జరుగుతున్న సమయంలో మంజీత్ బయట కూర్చున్నాడని, వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తలించామని అప్పటికే అతను మరణంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మిస్‌ఫైర్ అయిందా తనే కాల్చుకున్నాడా అనే కోణంలో ధర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.