నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాతో యువతికి వేధింపులు | Private Employee Arrest In Vulgar messages With Fake Profile | Sakshi
Sakshi News home page

నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాతో యువతికి వేధింపులు

Sep 7 2018 9:05 AM | Updated on Sep 7 2018 9:05 AM

Private Employee Arrest In Vulgar messages With Fake Profile - Sakshi

మోహన్‌ కృష్ణ వర్మ

బాధితురాలి ఫ్రెండ్స్‌కు అసభ్యకర సందేశాలు   

సాక్షి, సిటీబ్యూరో:  నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా క్రియేట్‌ చేసి అసభ్యకర సందేశాలు పంపుతూ ఓ యువతిని వేధిస్తున్న ప్రైవేట్‌ ఉద్యోగిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధూలపల్లికి చెందిన మోహన్‌ కృష్ణ వర్మ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి మన్సూరాబాద్‌కు చెందిన ఓ యువతి ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అనంతరం స్వాతిరెడ్డి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా క్రియేట్‌ చేసి బాధితురాలి ఫొటోను ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకొని బాధితురాలి ఫ్రెండ్స్‌కు రిక్వెస్ట్‌లు పంపాడు. ఆ తర్వాత అసభ్యకర సందేశాలు పంపిస్తూ బాధితురాలి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించాడు. తన స్నేహితురాలి ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మోహన్‌ కృష్ణ వర్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement