రైల్లో పొగతాగొద్దన్నందుకు గర్భిణీని చంపేశాడు!

Pregnant Woman Killed For Objecting To Co-Passenger Smoking In Train - Sakshi

షాజహాన్‌పూర్‌: రైలులో తోటి ప్రయాణికుడు పొగతాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ గర్భిణీ ప్రాణాలు పోగొట్టుకుంది. పంజాబ్‌– బిహార్‌ జలియన్‌ వాలా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బిహార్‌కు చెందిన చినత్‌ దేవి(45) అనే గర్భిణీ తన కుటుంబంతో కలిసి ఛత్‌ పూజల్లో పాల్గొనేందుకు సొంతూరుకు వెళ్తున్నారు. వారితోపాటు జనరల్‌ బోగీలో ప్రయాణిస్తున్న సోనూ యాదవ్‌ పొగతాగుతుండటంతో చినత్‌ దేవి అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఉన్న సోనూ చినత్‌ దేవి గొంతు నులిమాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను షాజహాన్‌పూర్‌లో రైలు ఆపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top