చట్ట ప్రకారమేనా..?

Police Inquiry To Actor Balaji On Kidney Change Case - Sakshi

బాలాజీ భార్యకు కిడ్నీమార్పిడిపై పోలీసుల విచారణ

సాక్షి, బంజారాహిల్స్‌: తన భార్యకు కిడ్నీ ఇచ్చిన తనకు ఎలాంటి చికిత్స చేయించకుండా బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న సినీ నటుడు బాలాజీపై బాధితురాలు భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారణ నిమిత్తం బా లాజీని స్టేషన్‌కు పిలిపించారు. కిడ్నీ మార్పిడి, బాధితురాలి నుంచి కిడ్నీ సేకరణ తదితర అంశాలపై వివరాలు సేకరించారు. తాము చట్ట ప్రకార మే లక్ష్మి నుంచి కిడ్నీని తీసుకున్నామని అందుకు తగిన డాక్యుమెంట్లను అందజేశారు. మానవతా దృక్ఫథంతోనే ఒప్పందం కుదర్చుకున్నామన్నారు. కిడ్నీ తీసుకునే ముందు ఆరుగురు డాక్టర్ల బృందం సర్టిఫై చేయాల్సి ఉంటుందని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నట్లు తెలిపారు.

తనకు రూ. 20 లక్షలు ఇస్తామని, తన తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తామని, తనకు సిని మాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పినందునే తాను కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నానని భాగ్యలక్ష్మి తెలిపింది. తనకు రావాల్సిన డబ్బుల విషయమై ఫోన్‌ చేస్తే బ్లాక్‌మెయిల్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీనిపై నటి శ్రీరెడ్డితో కలిసి మానవ హక్కుల కమిషన్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్, ‘మా’ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తనకు న్యాయం జరగకపోతే చావే శరణ్య మని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top