సునీల్‌ కోసం వేట.!

Police Hunting For Gangster Sunil - Sakshi

ప్రత్యేక పోలీసు బృందంతో గాలింపు చర్యలు

అదుపులో ఉన్నాడనిమరో వైపు ప్రచారం ...?

కడప అర్బన్‌ :దాదాపు మూడు జిల్లాల్లో కిడ్నాప్, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ కుమార్‌ అలియాస్‌ సునీల్‌ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తన ముఠాతో కలిసి కిడ్నాప్‌లు, హత్యలకు పాల్పడిన సునీల్‌ రెండోసారి గత నెల 27న పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.

ఈ సంఘటనలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు బంధువులు, ఒక ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను రెండు రోజుల క్రితం పెండ్లిమర్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సునీల్‌ పారిపోయేందుకు సహకరించిన వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పారిపోయిన రోజు నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు అతన్ని కడప– నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  కానీ జిల్లా పోలీసులు మాత్రం అతని ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top