
ప్రముఖ సిద్ధాంతి వీరభద్ర శాస్త్రి
సాక్షి, నిడదవోలు (పశ్చిమ గోదావరి) : ఇంటిలిజెన్స్ ఆఫీసర్ తీసుకురమ్మంటున్నారని సివిల్ డ్రెస్‌లో వచ్చిన నలుగురు ప్రముఖ సిద్ధాంతిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. నిడదవోలుకు చెందిన ప్రముఖ సిద్ధాంతి వీరభద్ర శాస్త్రిని గుర్తు తెలియని నలుగురు ఉదయం 8గంటల సమయంలో విజయవాడ నుంచి ఇంటిలిజెన్స్ ఆఫీసర్ తీసుకురమ్మంటున్నారని చెప్పి కిడ్నాప్ చేశారు.
ముందుగా సిద్ధాంతి చేతిలోని సెల్ ఫోన్ లాక్కున్న కిడ్నాపర్లు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు అతని భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియక ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యింది. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.