ప్రాణం తీసిన ప్రహరీ వివాదం

సాక్షి, హైదరాబాద్‌: ప్రహరీ విషయంలో జరిగిన గొడవ ఓ వృద్ధుడి ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌ హాస్టల్‌ సమీపంలో జరిగింది. ఓయూ రిటైర్డ్ ఉద్యోగి హుమయూన్ కబీర్‌పై ఓయూ ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌ హాస్టల్ సమీపంలో శనివారం రాత్రి దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి కట్టెలతో కొట్టి ఆయన్ను తీవ్రంగా గాయపరిచారు. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కబీర్ ఇంటి పక్కనే ఉండే భార్యాభర్తలు, మరొకరు కలిసి ఇతనిపై దాడి చేసినట్లు, ప్రహరీ విషయంలో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ముగ్గురిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు.

Back to Top