సైకిల్‌ను తప్పించబోయి.. | Person Died In Accident In Mandasa | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Jul 9 2019 7:18 AM | Updated on Dec 28 2024 11:02 AM

Person Died In Accident In Mandasa

సాక్షి, శ్రీకాకుళం : మండలంలోని సందూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గిరిజన యువకుడు మరణించిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..మండలంలోని కొండలోగాం పంచాయతీ, బంసుగాం గ్రామానికి చెందిన సవర రాజేష్‌(24) అదే గ్రామానికి చెందిన తన స్నేహితులు రామారావు, చిన్నలతో కలిసి పలాస మండలంలోని గొప్పిలి గ్రామానికి వెళ్లి ఆదివారం రాత్రి తిరిగి వస్తున్నారు.

వీరు మందస మండలంలోని సందూరు వద్దకు చేరుకోగా ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి బైక్‌ అదుపు తప్పడంతో రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో రాజేష్‌కు తీవ్ర గాయాలవ్వగా, మిగతా ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురునీ పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేష్‌ మరణించాడు. దీంతో ఒక్కగానొక్క కుమారుడు మరణిండంతో రాజేష్‌ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని బంసుగాం తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మందస ఎస్‌ఐ చిట్టిపోలు ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement