హోటల్‌ గదిలో నటి ఆత్మహత్య?

Payel Chakraborty found hanging in a hotel room - Sakshi

కోల్‌కతా : ప్రముఖ బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్‌ చక్రబోర్తి (38) మృతిచెందారు. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్‌ గదిలో బుధవారం రాత్రి పాయెల్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. 'మంగళవారం హోటల్‌లో ఓ గది తీసుకున్న పాయెల్‌ బుధవారం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాలని చెప్పారు. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్‌ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు' అని హోటల్‌ సిబ్బంది తెలిపారు. దీంతో బుధవారం ఎంతగా డోర్‌ కొట్టినా తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తే అమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందన్నారు. పాయెల్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. అయితే పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతే హత్యా, ఆత్మహత్యా అనేది తేలుతుందన్నారు.

సినిమాలు, టీవీ సీరియల్‌లు, పలు వెబ్‌ సిరీస్‌ల్లో పాయెల్‌ నటించారు. చోఖేర్‌ తారా తుయ్‌, గొయెండా గిన్నీ వంటి షోలను కూడా ఆమె చేస్తున్నారు. పాయోల్‌ మృతితో పశ్చిమబెంగాల్‌ సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె తన భర్తనుండి గత కొద్దిరోజు నుండే వేరుగా ఉంటున్నారు. పాయెల్‌కు ఓ కుమారుడు ఉన్నారు. పాయెల్‌ మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు సిలిగురి చేరుకొన్నారు. పాయెల్‌ రాంచి వెళుతున్నట్టు తనతో చెప్పిందని, ఇక్కడికి ఎందుకొచ్చిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తండ్రి ప్రబిర్‌ గుహా తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top