మళ్లీ బ్లాస్ట్‌ | Old Woman Dies in Gas Cylinder Blast Hyderabad | Sakshi
Sakshi News home page

మళ్లీ బ్లాస్ట్‌

Jan 23 2019 6:08 AM | Updated on Jan 23 2019 6:08 AM

Old Woman Dies in Gas Cylinder Blast Hyderabad - Sakshi

చికిత్స పొందుతూ మరణించిన శ్రుతికీర్తి

హస్తినాపురం: ఇటీవల కాప్రాలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరవకముందే మరో సిలిండర్‌ పేలుడు చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి వృద్ధురాలు మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు     – మిగతా 6లోu

చెందిన శ్రుతికీర్తి(80) వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లోని సోమనాథ క్షేత్రానికి వచ్చింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో ఆలయం వంట గదిలోని స్టవ్‌ వెలిగించగా, ఆకస్మాత్తుగా సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి శ్రుతికీర్తికి తీవ్ర గాయాలయ్యాయి. పక్క గదిలో ఉన్న లలితకు కిటీకి అద్దాలు పగిలి శరీరానికి గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడున్న భక్తులు వచ్చి వీరిద్దరినీ ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రుతికీర్తి రాత్రి 9గంటల సమయంలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement