వృద్ధుడి ఆత్మహత్య  | Old Man Committed Suicide | Sakshi
Sakshi News home page

వృద్ధుడి ఆత్మహత్య 

Apr 2 2018 1:20 PM | Updated on Oct 16 2018 4:50 PM

Old Man Committed Suicide - Sakshi

శ్రీనివాసచారి మృతదేహం 

పాల్వంచరూరల్‌: మతి స్థిమితం సక్రమంగా లేని వృద్ధుడు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని పాండురంగాపురం గ్రామస్తుడు కఠోజు శ్రీనివాసచారి(56) శనివారం రాత్రి ఇంట్లో దూలానికి లుంగీతో ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున భార్య మేల్కొని వరండాలోకి వచ్చేసరికి, ఉరికి వేలాడుతూ భర్త కనిపించాడు. పోలీసులకు ఆమె సమాచారమిచ్చింది.

మానసిక వ్యాధితో బాధపడుతున్న ఇతడు, హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో కొన్ని సంవత్సరాలుగా చికిత్స పొందుతున్నాడు. ఇతడికి భార్య పుష్పావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటన స్ధలాన్ని హెడ్‌ కానిస్టేబుల్‌ సూర్యారావు పరిశీలించారు. శ్రీనివాసచారి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement