
ఇంటికి చేరిన బీజానాబీ
చిట్యాల (నకిరేకల్) : ఆసరా పింఛన్ తెచ్చుకునేందుకు వెళ్లి అదృశ్యమైన చిట్యాల పట్టణం శివాజీనగర్‌కు చెందిన బీజానాబీ మంగళవారం ఇంటికి చేరుకుంది. ఈ నెల 16వ తేదీన ఆసరా పింఛన్ తెచ్చుకునేందుకు వెళ్లి బీజానాబీ అదృశ్యమైంది. బీజానాబీ అదృశ్యమైన విషయం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది.
దీంతో నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంచరిస్తున్న బీజానాబీని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యుల పోన్ నంబర్‌కు సమాచారం అందిచారు. ఆమెను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. సాక్షిలో ప్రచురితమైన కథనం వల్లే బీజానాబీ ఆచూకీ లభించినందుకు ఆమె కుటుంబసభ్యులు ‘సాక్షి పత్రిక’కు కృతజ్ఞతలు తెలిపారు.