Return To home
-
ఇక్కడికొచ్చేదాకా వణికిపోయాం
ఢిల్లీ/ముంబై/చెన్నై/బెంగళూరు: పశ్చిమాసియాలో మూడ్రోజులుగా చిక్కుకుపోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయుల్లో కొందరు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ క్షణమొక యుగంలా గడిచిందని, తిరిగొస్తామా అన్న భయంతో గడిపామని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకోగానే పశ్చిమాసియాలో తాము అనుభవించిన భయాందోళనలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇప్పటిదాకా నా మనసు స్థిమితపడలేదు. విమానం ఎక్కాక కూడా అదే ఆందోళన. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాతే కుదుటపడ్డా’’అని సునీల్ గుప్తా అనే ప్రయాణికుడు చెప్పారు.‘‘బుక్ చేసిన విమానం రద్దవడంతో నాలుగు రోజులు దుబాయ్‌లోనే ఉండాల్సి వచి్చంది. దూసుకొస్తున్న క్షిపణులను గగనతల రక్షణవ్యవస్థలు పేల్చేయడం కళ్లారాచూశా. దీంతో భయం ఒక్కసారిగా పెరిగింది. హోటల్ ఖర్చుల ఆర్థికభారం పెనుసమస్యగా మారింది’’ అని దుబాయ్ నుంచి వచి్చన నోయిడా వాసి అరవింద్ చెప్పారు. ‘‘ఇరాన్లో చదువుతున్న నా కూతురు హాస్టల్లో ఉంటోంది. వాళ్లకు సమీపంలో క్షిపణి పడటంతో హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది’’ అని కున్వర్ షకీల్ అహ్మద్ చెప్పారు. ‘‘న్యూయార్క్ నుంచి వస్తూ శనివారం దుబాయ్ చేరుకున్నా. మధ్యాహ్నం గగనతలం మూసేశారు. మమ్మల్ని హోటల్‌కు తరలించారు. బాంబులు, క్షిపణుల మోత చూసి వణికిపోయా’’ అని శుభా అనే మహిళ చెప్పారు. క్యూల్లో వేల మంది.. ‘‘విమానాలు రద్దయ్యాయని తెలియగానే దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిన్నారులు ఏడుపు మొదలెట్టారు. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో వేలాదిమంది పోగుబడ్డారు. క్యూ వరసల్లో దాదాపు 20,000 మంది నిలబడ్డారు. అందర్నీ తర్వాత వేర్వేరు హోటళ్లకు తరలించారు. స్వదేశానికి తిరిగొచ్చామంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చలువే’’ అని తమిళనాడులోని నాగూర్‌కు చెందిన సయ్యద్ అలీ చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేరుకున్న భారతీయుల ముఖాల్లో అమితానందం కన్పించింది.‘‘అబూదాబిలో చమురుశుద్ధి కంపెనీలో పనిచేస్తా. భారత్‌కు వచ్చేందుకు అక్కడి ఎయిర్‌పోర్టకు రాగానే అలర్ట్ ప్రకటించారు. కిటికీల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు. కింద కూర్చోమన్నారు. క్షిపణి దూసుకొస్తోందని చెప్పగానే ప్రాణం పోయినంత పనైంది. మీకు సమీపంలో క్షిపణి వచ్చిందంటే ఎలా ఉంటుంది?’’అని మంగళూరుకు చెందిన సౌరభ్ చెప్పారు. -
పర్యాటకులు అమెరికాలో ఎప్పటిదాకా ఉండొచ్చు?
వాషింగ్టన్: ఫలానా తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వమే టూరిస్ట్ వీసాను జారీచేసినాసరే ఆ తేదీకంటే ముందే చాలా సందర్భాల్లో స్వదేశానికి వెనుతిరగాల్సి ఉంటుందని ట్రంప్ సర్కార్ కొత్త మెలిక పెట్టింది. వాస్తవానికి ఈ విషయం వీసా సంబంధ నిబంధన పత్రంలో ఉంటుందని తన వితండవాదాన్ని సమర్థించుకునే ప్రయత్నంచేసింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ అంతర్జాతీయ పర్యాటకులకు ముఖ్య గమనిక. అమెరికాలో ఎన్ని రోజుల వరకు పర్యటించవచ్చు అనేది మీకు జారీచేసిన టూరిస్ట్ వీసా మీద పేర్కొన్న గడువు తేదీ నిర్ణయించబోదు. గడువును అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. మీరు అమెరికాలో అడుగుపెట్టగానే మీతో ఆయన ఒక ఐ–94 దరఖాస్తును నింపిస్తారు. అందులో మీ చట్టబద్ధ పర్యాటకానికి చివరి తేదీ రాసి ఉంటుంది. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలంటే https:// i94.cbp.dhs.gov/ home వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో మీ టూరిస్ట్ వీసా సంబంధిత వివరాలను సరిచూసుకోండి. ఐ–94 దరఖాస్తులో ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ అని ఒక తేదీ రాసి ఉంటుంది. అదే మీ చట్టబద్ధ పర్యటనకు ఆఖరి గడువు తేదీ. టూరిస్ట్‌వీసా గడువు తేదీ, ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ తేదీలు ఒకేలా ఉండాలనే నియమం ఏమీలేదు. సాధారణంగా టూరిస్ట్‌వీసా గడువు కంటే ముందుగానే ‘అడ్మిట్ అన్టిల్ డే’ ముగుస్తుంది’’ అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. -
Updates: విజయవంతంగా భూమ్మీదకు సునీత అండ్ కో
అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్ అండ్ కోదివి నుంచి భూమికి సేఫ్‌గా అడుగు పెట్టిన సునీతా విలియమ్స్ఫ్లోరిడా తీరం సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకఅత్యంత ఉత్కంటగా సాగిన చివరి 7 నిమిషాలుఈ రోజు ఉ.3.27 గంటలకు భూమికి చేరిన సునీతాక్రూ డ్రాగన్ వ్యోమనౌక దగ్గరకు వచ్చిన నాసా శాస్త్రవేత్తలుక్రూ డ్రాగన్ సేఫ్ ల్యాండిగ్తో నాసా శాస్త్రవేత్తల సంబరాలుల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారుఅక్కడే వారికి కొన్ని రోజులు పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులుసుదీర్గకాలం స్పేస్‌లో ఉండటం వల్ల పలు ఆరోగ్య సమస్యలుఆరోగ్య సమస్యలను ఎప్పటకప్పుడు పరీక్షించనున్న వైద్యులుదీంతో తన మూడో అంతరిక్ష యాత్రను సైతం విజయవంతంగా పూర్తి చేసిన సునీతా విలియమ్స్గతంలో 2006,2012లలో రెండు సార్లు అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సునీతా విలియమ్స్ Splashdown confirmed! #Crew9 is now back on Earth in their @SpaceX Dragon spacecraft. pic.twitter.com/G5tVyqFbAu— NASA (@NASA) March 18, 2025కాసేపట్లో భూమి మీదకు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్ రాక.సునీతా విలియమ్స్ కోసం వేచి చూస్తున్న యావత్ ప్రపంచం17 గంటల ప్రయాణం తరువాత భూమిపైకి చేరుకోనున్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకభూమి మీదకు చేరగానే వ్యోమగాములకు వైద్య పరీక్షలు8 రోజుల మిషన్.. 9 నెలల హైటెన్షన్ అనుక్షణం ఒక అద్భుతం.. ప్రతీ క్షణం ప్రమాదంతో సహవాసం నిజానికవి 9 నెలలు కాదు..ఒక్కో క్షణం ఒక్కో యుగం అంతులేని ఒత్తిడిలోనూ అంతరిక్షాన్ని జయించిన సునీత.. ధీర వనిత అనుక్షణం ఒక అద్భుతం..👉మరికొద్ది గంటల్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్ రాకలైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసాభారత కాలమానం ప్రకారం.. 2.15గం. ప్రారంభం కానున్న లైవ్నాసా క్రూ 9 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్(ISS)కు వెళ్లిన సునీత, విల్మోర్290 రోజులపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన ఇరువురు నాసా వ్యోమగాములుభూమి యొక్క ఉపరితలం నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మహిళ(59 వ్యోమగామిగా సునీతా విలియమ్స్ రికార్డు సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఇద్దరు!సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లతో పాటు భూమ్మీదకు రానున్న నిక్ హేగ్(నాసా), అలెగ్జాండర్ గుర్బునోవ్(రష్యా వ్యోమగామి)క్రూ-9లో భాగంగా కిందటి ఏడాది సెప్టెంబర్‌లో అక్కడికి వెళ్లిన హేగ్, గుర్బునోవ్సునీత, బచ్‌ల కోసం కావాల్సినవి అందించడంతో పాటు వాళ్లను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేసిన ఈ ఇద్దరు స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ రానున్న మొత్తం నలుగురుకిందటి ఏడాది జూన్‌లో.. మానవ సహిత బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్న ఇద్దరు స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చిక్కుకుపోయిన ఇద్దరు ఇదీ చదవండి: అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే..ఇండియన్ డాటర్‌కు స్వాగతంభారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్సునీత సాహసయాత్రపై భారత్‌లో అభినందనల వెల్లువత్వరలో భారత్‌కు రావాలంటూ లేఖ రాసిన ప్రధాని మోదీ క్షేమంగా రావాలంటూ గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో పూజలు, యాగాలు 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి క్రూ డ్రాగన్ వ్యోమనౌక తిరుగు పయనం ఇలా.. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత: మంగళవారం ఉదయం 8.15కు మొదలుఅంతరిక్ష కేంద్రం నుంచి విడిపోవడం: ఉదయం 10.15 గంటలకు ప్రారంభం. భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ఆన్: బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు. సాగర జలాల్లో ల్యాండింగ్: తెల్లవారుజామున 3.27 గంటలకు.సహాయ బృందాలు రంగంలోకి దిగి.. స్పేస్ఎక్స్ క్యాపూల్స్ క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్షయాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు.ఇదీ చదవండి: Sunita Williams: భూమ్మీదకు సునీతా విలియమ్స్.. ఆమె జీతం ఎంతో తెలుసా ? -
ఇంకా ముందుగానే సునీతా విలియమ్స్ రాక!
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరింత ముందుగానే భూమ్మీదకు రానున్నారా?. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో ఎనిమిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే చిక్కుకుపోయిన ఆమెను వెనక్కి రప్పించే ప్రక్రియ మరింత వేగవంతం కానుందా?.. అసలు మేటర్ ఏంటంటే..మార్చి నెలాఖరులో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో క్రూ-10 మిషన్ నిర్వహించాలని నాసా భావించింది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ఐఎస్ఎస్(ISS)కు పంపాలనుకుంది. అయితే ఈ ప్రయోగంలోనే సునీత, విల్మోర్లను తిరిగి భూమ్మీదకు రప్పించేందుకు స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ‘ఎండేవర్’ను వినియోగించబోతోంది. తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేయగా ఇప్పుడది ముందుకు జరిగింది. మార్చి 12వ తేదీనే ఈ ప్రయోగం నిర్వహించబోతున్నారని నాసా(NASA) ధృవీకరించింది. ఈ కొత్త టీం అక్కడికి చేరుకోగానే.. -క్రూ-9లో వెళ్లిన సునీతా విలియమ్స్(Sunita Williams), విల్మోర్లు రిలీవ్ అవుతారు. అలా డ్రాగన్ క్యాప్సూల్ ఎండేవర్ ద్వారా ఇద్దరు భూమ్మీదకు రావడానికి మార్గం సుగమం అవడమే కాకుండా ఐఎస్ఎస్ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మార్చి 19వ తేదీన సునీత, విల్మోర్లు భూమ్మీద అడుగుపెట్టే అవకాశాలున్నాయి .ఇక క్రూ-10లో వెళ్లే నలుగురు వోమగాములు 150 రోజుల తర్వాత అంటే ఈ జులైలో స్పేస్ ఎక్స్‌కే చెందిన ఎండూరెన్స్ క్యాప్సూల్ ద్వారా భూమ్మీదకు చేరుకుంటారు. కిందటి ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా క్రూ-9 మిషన్‌లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. అయితే.. స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి సునీత, విల్మోర్లు స్పేస్ స్టేషన్లోనే ఉండిపోయారు. ఇదీ చదవండి: యాక్సియోమ్ మిషన్-4లో భారతీయుడు -
T20 WC: పాక్‌పై గెలిచి సెమీస్‌కు న్యూజిలాండ్.. భారత్ ఇంటికి
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో వెళ్లిన భారత మహిళల బృందం కథ లీగ్ దశలోనే ముగిసింది. తమ అదృష్టాన్ని ఇతర జట్ల చేతిలో పెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’ చివరి పోరులో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ నెగ్గితేనే భారత్ ముందంజ వేసే అవకాశం ఉండగా... కివీస్ ఆ అవకాశం ఇవ్వలేదు. లీగ్ దశలో మూడో విజయంతో ఆ జట్టు దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా... పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 2 కీలక వికెట్లు తీసిన ఎడెన్ కార్సన్ (2/7) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఈ గ్రూప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచి ఆ్రస్టేలియా ఇప్పటికే సెమీస్ చేరగా, కివీస్‌కు రెండో స్థానం ఖాయమైంది. రెండు విజయాలకే పరిమితమైన భారత్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. గెలిపించిన బౌలర్లు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. నెమ్మదైన పిచ్‌పై ఎవరూ దూకుడుగా ఆడలేకపోవడంతో పరుగులు వేగంగా రాలేదు. సుజీ బేట్స్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హ్యాలిడే (22), సోఫీ డివైన్ (19), ప్లిమ్మర్ (17) కీలక పరుగులు జోడించారు. పాక్ బౌలింగ్ మెరుగ్గా ఉన్నా... టీమ్ ఫీల్డింగ్ దెబ్బ తీసింది. పాక్ ఫీల్డర్లు ఏకంగా 8 క్యాచ్‌లు వదిలేయడంతో కివీస్ 100 పరుగులు దాటగలిగింది. అనంతరం పాక్ పేలవమైన బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. సులువైన లక్ష్యం ముందున్నా ఆ జట్టు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోగా, కివీస్ బౌలర్లు సెమీస్ స్థానం కోసం బలంగా పోరాడారు. పాక్ జట్టులో ఫాతిమా సనా (21), మునీబా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవర్‌ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు... 12 బంతుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. -
Bangladesh: ఎన్నికలవేళ హసీనా తిరిగొస్తారు: సాజీబ్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తారని ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ వెల్లడించారు. ‘‘ బంగ్లా మధ్యంతర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన మరుక్షణమే ఆమె భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తారు’ అని వాజెద్ అన్నారు. ప్రస్తుతం హసీనా న్యూఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని యోచిస్తున్నట్లు భారత మీడియా కథనాలు ప్రచురించింది. అయితే బ్రిటన్ హోం శాఖ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. బంగ్లాదేశ్ గురించి బ్రిటన్ విదేశాంగ మంత్రితో మాట్లాడానని, ఆయన ఎలాంటి వివరాలను పంచుకోలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం చెప్పారు. ఈ నేపథ్యంలో వాజెద్ మీడియాతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వాజెద్ ప్రకటించారు. -
శిథిలాల కుప్ప ‘ఖాన్ యూనిస్’.. తిరిగి వస్తున్న ‘గాజా’ వాసులు
జెరూసలెం:పాలస్తీనా దక్షిణ గాజాలో ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. భీకర యుద్ధం కారణంగా కొంత కాలంగా తమ ప్రాంతానికి దూరంగా తలదాచుకున్న ఖాన్ యూనిస్ వాసులు ఇంటిబాట పట్టారు. సైకిళ్లు వేసుకుని, కాలి నడకన తమ సొంత ప్రాంతానికి తిరిగి వస్తున్నారు. అయితే వారికి అక్కడ ఏమీ మిగల లేదు. భవనాలన్నీ ధ్వంసమై శిథిలాల కుప్పలు మిగిలాయి. ఒకప్పుడు భారీ భవంతులతో కళకళలాడిన ఖాన్ యూనిస్ నగరం ప్రస్తుతం శిథిలాల కుప్పలతో నిండిపోవడాన్ని చూసిన వారు తమ నగరం ఇలా అయిపోయిందేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసిన బాంబులు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ఖాన్‌యూనిస్ జనాభా 14 లక్షలు. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా డిసెంబర్లో ఖాన్ యూనిస్ నగరంపైకి సేనలను ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పంపింది. హమాస్ ఉగ్రవాదులకు కేంద్రమైన నగరాన్ని మొత్తం ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదుల జాడ కోసం మొత్తం జల్లెడ పట్టారు. దాడులతో లక్షలాది మంది ఖాన్ యూనిస్ వాసులు నగరం విడిచి వెళ్లిపోయారు. మరో వైపు ఖాన్‌యూనిస్‌పై జరిపిన దాడుల్లో వేల మంది హమాస్ ఉగ్రవాదులను హత మార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇదీ చదవండి.. సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు -
పాకిస్తాన్‌కు షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (73) నాలుగేళ్ల స్వీయ ప్రవాసం అనంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. జనవరిలో సాధారణ ఎన్ని కలు జరగనున్న నేపథ్యంలో శనివారం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ నుంచి బయల్దేరి ఇస్లామాబాద్ చేరుకున్నారు. కోర్టుకు సమరి్పంచాల్సిన బెయిల్ పత్రాలపై సంతకం తదితరాల అనంతరం అదే విమానంలో లాహోర్ వెళ్లి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. తన తల్లి, భార్య రాజకీయాలకు బలయ్యారని గుర్తు చేసుకుంటూ భా వోద్వేగానికి లోనయ్యారు. వారి చివరిచూపుకూ నోచుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
నేడు స్వదేశానికి నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(73) దాదాపు నాలుగేళ్ల తర్వాత శనివారం స్వదేశానికి రానున్నారు.లండన్ నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. అక్కడి నుంచి చార్టెర్డ్ విమానంలో శనివారం పాకిస్తాన్‌కు చేరుకుంటారు. లాహోర్‌లో శనివారం సాయంత్రం తమ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్(పీఎంఎల్–ఎన్) నిర్వహించే బహిరంగ సభలో షరీఫ్ పాల్గొంటారు. అయితే, ఆయన భద్రతకు ముప్పు ఉందన్న నిఘా సమాచారం మేరకు పంజాబ్ పోలీస్ యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. -
‘నిష్క్రమణ’ నిర్ణయం సహేతుకమే
వాషింగ్టన్: అఫ్గాన్‌ను తమ సేనలు అర్ధంతరంగా వదిలివెళ్లడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నారు. యుద్ధక్షేత్రంగా మారిన అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమణ ఘట్టం.. చరిత్రలో సహేతుక రీతిలోనే పదిలమై ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు 31వ తేదీలోపు అమెరికా సైన్యం స్వదేశానికి వస్తుందని బైడెన్ గతంలో ప్రకటించగా అంతకు రెండు వారాల ముందే తాలిబన్లు తెగబడి అఫ్గాన్ మొత్తాన్నీ ఆక్రమించారు. రణరంగంలో అఫ్గాన్ ప్రభుత్వ బలగాలకు తోడుగా నిలవడకుండా సొంత దేశానికి సైన్యాన్ని వెనక్కి పంపడంతో ఎయిర్‌పోర్టు వద్ద వందలాది మంది అఫ్గాన్ల అనూహ్యస్థాయిలో వలసలతో తోపులాటలు, కాల్పులు జరిగాయి. దీంతో విపక్ష రిపబ్లికన్ పార్టీసహా పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో బైడెన్ మరోసారి స్పందించారు. ఆదివారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘మా నిర్ణయం న్యాయబద్ధమైన, సహేతుకమైన నిర్ణయంగానే చరిత్రలో నిలిచిపోతుందని భావిస్తున్నా. ఇక మీదటైనా తాలిబన్లు ప్రజామోద నిర్ణయాలు తీసుకోవాలి. దేశాన్ని ఆర్థికంగా, వాణిజ్యపరంగా నిలబెట్టాలి. తమ ధర్మమే అఫ్గాన్‌లో కొనసాగాలని తాలిబన్లు కోరుకుంటున్నారు. తమ పాలననూ అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందని నమ్ముతున్నారు. అమెరికా లాంటి దేశాల దౌత్యసాయం వారికి అక్కర్లేదట. తాలిబన్లు.. సరైన ప్రణాళికలేని సాయుధమూకల గుంపు’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. -
ఎట్టకేలకు సొంతగడ్డపై...
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనూహ్యంగా వాయిదా పడిన రోజునుంచి ఎప్పుడెప్పుడు ఇళ్లకు చేరుదామా అని ఎదురు చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఊరట లభించింది. భారత్‌నుంచి వచ్చే విమానాలపై తమ దేశం విధించిన ఆంక్షల నేపథ్యంలో మాల్దీవులలో కొన్ని రోజులు గడిపిన అనంతరం వీరంతా సొంతగడ్డపై అడుగు పెట్టారు. లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు అందరూ సోమవారం ఉదయం స్వదేశంలోకి ప్రవేశించారు. ‘ఎయిర్ సీషెల్స్’ ఫ్లయిట్ ద్వారా వీరంతా సిడ్నీ నగరానికి చేరుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రికెటర్లు ఇప్పుడే తమ ఇంటికి వెళ్లేందుకు వీలు లేదు. రెండు వారాల పాటు వీరంతా స్థానిక మారియట్ హోటల్లో క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న చెన్నై కోచ్ మైక్ హస్సీ కూడా విడిగా ఖతర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మే 4న బీసీసీఐ ప్రకటించగా... అందరికంటే చివరగా ఆసీస్ క్రికెటర్లు సొంత దేశానికి వెళ్లగలిగారు. తమ ఆటగాళ్లు క్షేమంగా తిరిగి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ...అందుకు తగిన ఏర్పాట్లు చేసిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
ఇక అగస్త్య డ్యూటీ...
ముంబై: నాలుగు నెలల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఆస్ట్రేలియా సిరీస్ అంటూ క్రికెట్లో తలమునకలై ఉన్న హార్దిక్ పాండ్యా శనివారం కొత్త బాధ్యతల్ని స్వీకరించాడు. తన నాలుగు నెలల కొడుకు అగస్త్య బాగోగుల్ని పాండ్యా భుజానికెత్తుకున్నాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కే ఎంపికైన హార్దిక్ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ఇంటికి చేరుకోగానే తన బుజ్జాయి అగస్త్యకు పాలు పట్టిస్తూ సేదతీరాడు. ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్న పాండ్యా ‘జాతీయ విధుల నుంచి తండ్రి బాధ్యతల్లోకి’ అనే వ్యాఖ్యను జతచేశాడు. ఆసీస్‌తో వన్డేలు, టి20ల్లో అదరగొట్టిన పాండ్యాకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ‘వన్డే, టి20 సిరీస్ ముగియగానే ఇంటికి వెళ్లేందుకే ప్రణాళికలు వేసుకున్నా. నేను వదిలి వచ్చినప్పుడు అగస్త్య 15 రోజుల పసికందు. ఇప్పుడు 4 నెలల చిన్నారి. అతన్ని చాలా మిస్ అయ్యా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని ఎదురు చూశా’ అని పాండ్యా పేర్కొన్నాడు. -
ఐదేళ్ల తరువాత అమ్మఒడికి..!
సాక్షి, హైదరాబాద్: దర్పణ్ యాప్.. తెలంగాణ పోలీసుల పనితనానికి నిదర్శనంగా నిలిచింది. టెక్నాలజీలో నిత్యం ముందుండే రాష్ట్ర పోలీసులు.. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల ఒడికి చేర్చి శెభాష్ అనిపించుకున్నారు. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన సోమ్ సోని అనే బాలుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతనికి ఎనిమిదేళ్ల వయసున్నపుడు 2015లో జూలై 14న తప్పిపోయాడు. ఈ మేరకు అలహాబాద్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు ఎంత గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు కూడా ఆశలు వదులుకున్నారు. కానీ, పిల్లాడు అదే నెల 23న అస్సాంలోని గలాపర పోలీసులకు తారసపడ్డాడు. దీంతో వారు స్థానిక చిల్డ్రన్స్ హోంకు తరలించారు. ముఖ కవళికల ఆధారంగా గుర్తింపు తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతికతతో దర్పణ్‌యాప్‌ను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పనిచేసే ఈ సాఫ్ట్వేర్ ముఖకవళికల ఆధారంగా పిల్లలను గుర్తిస్తుంది. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తప్పిపోయిన, గుర్తించిన పిల్లల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ పోలీసులు కేంద్రం ఆధ్వర్యంలోని ‘‘ట్రాక్ ద చైల్డ్ పోర్టల్’’నుంచి మిస్సింగ్ అండ్ ఫౌండ్ చిల్డ్రన్ డేటా సేకరిస్తున్నారు. ఈ క్రమంలో సోమ్ సోని ఫొటోను ఇందులో అప్లోడ్ చేశారు. వెంటనే సోని అస్సాంలోని ఓ చిల్డ్రన్ హోమ్‌లో ఉన్నాడని యాప్ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు అలహాబాద్ పోలీసులను, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు అస్సాంలోని చిల్డ్రన్ హోంకు వెళ్లి సోమ్ సోనిని కలుసుకున్నారు. సోమ్ తన తల్లిదండ్రులను చూసిన వెంటనే గుర్తుపట్టడం విశేషం. సోమ్ను చూడగానే అతని తల్లి గుండెలకు హత్తుకుని బోరున ఏడ్చింది. ఐదేళ్ల తరువాత తప్పిపోయిన పిల్లాడిని ‘దర్పణ్ యాప్’ద్వారా అమ్మఒడికి చేర్చడం తెలంగాణ పోలీసులకు గర్వకారణంగా భావిస్తున్నామని విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. తమ పిల్లాడిని తిరిగి తమ వద్దకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ పోలీసులకు సోని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
మనసు బంగారం
వలస కూలీల పాలిట ఆపద్భాంధవుడు అయ్యారు నటుడు, నిర్మాత సోనూ సూద్. పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చి కరోనా కోరల్లో చిక్కుకున్న వందలమంది వలస కూలీలు సోనుసూద్ సాయంతో వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. సోనూ సూద్ చేస్తున్న ఈ సాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో మంచి పని చేశారు. కేరళలోని ఏర్నాకులంలో చిక్కుకుపోయిన దాదాపు 180 మంది అమ్మాయిలను విమానంలో వారి స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేశారు సోను. వీరంతా కుట్టుపనులు చేయడం కోసం కేరళ వెళ్లారు. కానీ కరోనా వల్ల ఆ ఫ్యాక్టరీ మూత పడడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్వస్థలాలకు వెళ్లడానికి సరైన మార్గం కనిపించకపోవడంతో ఆ అమ్మాయిలు కేరళలోనే ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను ఓ స్నేహితుడి ద్వారా తెలుసుకున్న సోనూ సూద్ వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ఓ విమానాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి కేరళకు ప్రత్యేక విమానం కోసం సోనూ సూద్ సంబంధిత ప్రభుత్వ ప్రతినిధుల నుంచి అనుమతులు తీసుకున్నారు. కొచ్చి నుంచి ఈ విమానం భువనేశ్వర్ చేరుకోనుంది. కరోనా కారణంగా లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటినుంచి సోను ఇలా తనకు తోచినది చేస్తూ వస్తున్నారు. ఆ మధ్య హెల్త్ కేర్ వర్కర్స్ కోసం ముంబైలోని తన సొంత హోటల్‌ను ఇచ్చారు. ‘సినిమాల్లో విలన్‌గా కనిపించినా మీరు రియల్ లైఫ్‌లో హీరో.. మీ మనసు బంగారం’ అని సోనూ సూద్ అభిమానులు ఆయన్ను అభినందిస్తున్నారు. ఇప్పటివరకూ సోనూ సూద్ అభిమానులు కానివాళ్లు కూడా ఇప్పుడు ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. -
పెళ్లి కోసం 200 కి.మీ. సైకిల్ ప్రయాణం
హరింపుర్: ఉత్తరప్రదేశ్‌లోని హరింపూర్ జిల్లా పౌతియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి (23) తన పెళ్లి కోసం ఏకంగా 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. ప్రజాపతి వివాహం ఏప్రిల్ 25న జరగాల్సి ఉండగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం, వండిపెట్టేందుకు ఎవరూ లేకపోవడంతోనే ప్రజాపతి వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకే, సైకిల్‌పై పక్క జిల్లాలో ఉన్న వధువు ఇంటికి వెళ్లి, అక్కడ పెళ్లి చేసుకొని తిరుగు ప్రయాణంలో సతీసమేతంగా సైకిల్‌పై స్వగ్రామం చేరుకున్నాడు. -
అమ్మమ్మ ఇంట్లో ఆనందం
ఆ దంపతులకు మొదటి కాన్పులో కొడుకు పుట్టాడు. రెండో ప్రసవంలో కూతురు జన్మించాలని కోరుకున్నారు.. వారి మొర దేవుడు ఆలకించాడేమో.. మహాలక్ష్మిలాంటి కూతురు పుట్టింది. దీంతో ఆ భార్యాభర్తలతో పాటు కుటుంబీకులు ఎంతో సంతోషపడ్డారు. అంతలోనే వారి ఆనందం ఆవిరైపోయింది. పాపను ఎవరో అపహరించుకుపోయారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చిన్నారిని వెతికి తీసుకొచ్చారు. విచారణ బృందంతో కీలకంగా వ్యవహరించిన అధికారిణి పేరు చేతన.. అందుకే ఆ దంపతులు తమ పాపకు చేతన అని పేరుపెట్టారు. ప్రస్తుతం చేతన తన అమ్మమ్మ ఊరు ఎనగంటి తండాకు చేరుకుంది. చౌటుప్పల్(మునుగోడు): నగరంలోని కోఠి ప్రసూతి ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన చిన్నారి చేతన ప్రస్తుతం తన అమ్మమ్మ ఊరైన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ అనుబంధ ఎనగంటి తండాకు చేరింది. తండాకు చెందిన చాంది, సక్రా దంపతుల కుమార్తె విజయకు తొమ్మిదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన సభావత్ నరితో వివాహమైంది. వీరికి ఏడేళ్ల బాబు ఆనంద్ ఉన్నాడు. రెండో కాన్పు కోసం విజయను గత నెల 21న హైదరాబాద్ కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తల్లి చాంది, భర్త నరి తీసుకెళ్లారు. విజయకు రక్తం తక్కువగా వైద్యులు బ్లడ్ ఎక్కించారు. అనంతరం 27న ఆపరేషన్ చేసి వైద్యులు ప్రసవం చేశారు. విజయ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈక్రమంలో ఓ గుర్తు తెలియని మహిళ ఆస్పత్రి సిబ్బంది మాదిరిగా వచ్చి ఈనెల 2న చిన్నారిని అపహరించుకుపోయింది. కొంతసేపటి తర్వాత తేరుకున్న విజయ విషయాన్ని కుటుంబీకులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమయస్ఫూర్తి, చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ యంత్రాంగం 48గంటల్లోనే కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో చిన్నారిని తమ ఆధీనంలోకి తీసుకుని ఈనెల 4న తల్లిదండ్రులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు విజయ నేరుగా కుటుంబీకులతో కలిసి చిన్నారిని తీసుకుని తన పుట్టిల్లు ఎనగంటితండాకు చేరుకుంది. పరామర్శించి వెళ్తున్న తండావాసులు చిన్నారి చేతన అపహరణ విషయం తండావాసులకు ఆలస్యంగా తెలిసింది. విషయం తెలిసిన త ర్వాత గిరిజనులంతా చిన్నారి ఆచూకీ దొరకాలని నిత్యం ప్రార్థించారు. రెండు రోజుల అనంతరం ఆచూకీ లభ్యమవ్వడం.. అనంతరం తల్లీబిడ్డలు నేరుగా తమ ఊరికే రావడంతో ఆనందరం వ్యక్తం చేశారు. ఈనెల 5న తల్లిగారింటికి వచ్చిన విజయ, చిన్నారి చేతనను చూసేందుకు తండావాసులతో పాటు పరిసర తండావాసులు, పీపల్‌పహాడ్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మళ్లీ రాను.. విజయకు రక్తం తక్కువగా ఉండడంతో అవసరమైన మేరకు వైద్యులు రక్తాన్ని ఎక్కించి ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం సైతం ఆమె శరీరంలో తగిన మేర బ్లడ్ లేదు. ఇదే విషయాన్ని వైద్యులు ఆమెకు చెప్పారు. డిశ్చార్జి తర్వాత 15రోజులకు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి రావాలని వైద్యులు విజయకు సూచించారు. కానీ, తిరిగి ఆస్పత్రికి వెళ్లేందుకు విజయ ససేమిరా అంటోంది. మరోసారి వెళ్తే.. ఏం జరుగుతుందోనని ఆమె భయాందోళనకు గురవుతోంది. కలకాలం గుర్తుండాలనే ఆ పేరు మొదట కొడుకు పుట్టినందున రెండో కాన్పులో అమ్మాయి కావాలని కోరుకున్నాం. మేం అనుకున్నట్టుగానే అమ్మాయి పుట్టడంతో ఎంతో సంతోషపడ్డాం. అనంతరం నా బిడ్డను గుర్తుతెలియని మహిళ అపహరించుకుపోవడం మనోవేదనకు గురి చేసింది. పోలీసులు చురుకుగా వ్యవహరించి నా బిడ్డను తిరిగి అప్పగించడంతో ప్రాణం లేచివచ్చింది. దర్యాప్తు బృందంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారిణి ‘చేతన’ మాకు దైవంగా అనిపించింది. అందుకే మా పాపకు ఆమె పేరే పెట్టుకున్నాం. సభావత్ విజయ, చేతన తల్లి -
20 సంవత్సరాల తర్వాత..
నారాయణపేట రూరల్ : దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ మహిళ ఎట్టకేలకు తిరిగొచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సింగారం గ్రామానికి చెందిన గంగమ్మ కూలీ పనిచేస్తుండగా.. భర్త పశువులు కాసేవారు. ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు. అయితే భర్త అనారోగ్యం పాలుకావడంతో కుటుంబ పోషణ గంగమ్మపై పడింది. దీంతో మానసిక ఒత్తిడికి లోనై చిన్న కూతురు రేణును తీసుకుని అదృశ్యమైంది. ఏళ్ల తరబడి ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఇంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు పనిచేసుకుంటూ తండ్రిని పోషిస్తూ వచ్చారు. గ్రామానికి చెందిన పెద్ద మనుషులు దగ్గరుండి వారికి వివాహం చేశారు. ఈ క్రమంలో గత పదేళ్ల క్రితం గంగమ్మ భర్త మృతిచెందాడు. అదృశ్యమైన గంగమ్మ నాలుగేళ్ల క్రితం చేతకాని పరిస్థితుల్లో భూత్పూర్ మండలం అన్నాసాగర్ పంచాయతీ రావులపల్లికి ఒంటరిగా చేరుకుంది. అక్కడే పాచి పనిచేస్తూ కాలం వెళ్లదీసింది. ఈ నెల 19న కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆచూకీ అడగటంతో సొంతూరు సింగారం అని చెప్పడంతో గ్రామ యువకులు సర్పంచ్ నాగిరెడ్డికి సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి గంగమ్మ పెద్ద కుమార్తె చెన్నమ్మకు చెప్పి, భూత్పూర్ పోలీసుల సహకారంతో ఆమెను అప్పగించారు. -
ఇంటికి చేరిన బీజానాబీ
చిట్యాల (నకిరేకల్) : ఆసరా పింఛన్ తెచ్చుకునేందుకు వెళ్లి అదృశ్యమైన చిట్యాల పట్టణం శివాజీనగర్‌కు చెందిన బీజానాబీ మంగళవారం ఇంటికి చేరుకుంది. ఈ నెల 16వ తేదీన ఆసరా పింఛన్ తెచ్చుకునేందుకు వెళ్లి బీజానాబీ అదృశ్యమైంది. బీజానాబీ అదృశ్యమైన విషయం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంచరిస్తున్న బీజానాబీని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యుల పోన్ నంబర్‌కు సమాచారం అందిచారు. ఆమెను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. సాక్షిలో ప్రచురితమైన కథనం వల్లే బీజానాబీ ఆచూకీ లభించినందుకు ఆమె కుటుంబసభ్యులు ‘సాక్షి పత్రిక’కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంటికి చేరిన తెలుగు ప్రొఫెసర్లు
-
ఇంటికి చేరిన తెలుగు ప్రొఫెసర్లు
హైదరాబాద్: గతేడాది లిబియాలో ఉగ్రవాదుల చేతుల్లో కిడ్నాప్‌కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలు శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఏడాదిపాటూ ఐసిస్ కిడ్నాపర్ల చెరలో ఉన్న ప్రొఫెసర్ల విడుదలలో కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కీలకంగా వ్యవహరించారు. విదేశాంగశాఖ అధికారులు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలను వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. 2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్, శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరిపి సఫలమయ్యింది.


