టాలీవుడ్‌ నటుడి భార్యకు వేధింపులు | obscene SMSes: Actor Sivabalaji again complaint to cyber crime police | Sakshi
Sakshi News home page

పోలీసుల్ని ఆశ్రయించిన నటుడు శివబాలాజీ

Oct 29 2017 10:20 AM | Updated on Oct 29 2017 2:33 PM

obscene SMSes: Actor Sivabalaji again complaint to cyber crime police

సాక్షి, హైదరాబాద్‌ : సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్‌ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య, నటి మధుమితను ఎస్‌ఎంఎస్‌లతో వేధిస్తున్నారంటూ ఆయన మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూట్యూబ్‌లో తన భార్యకు సంబంధించి వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై అతడు కంప్లైంట్‌ చేశాడు. కాగా ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో సినిమా వార్తలతో పాటు, నటీనటులపై గాసిప్స్‌ రాస్తున్న విషయం తెలిసిందే. కొన్ని సైట్లు హ‌ద్దులు మీరి అత్యుత్సాహాన్ని ప్ర‌దర్శిస్తూ న‌టుల‌పై ఊహాజనిత వార్తలు రాయడంతో తమ పరువు మర్యాదలకు భంగం కలిగిస్తున్నాయని తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో శివబాలాజీ కూడా ’మా’ కు మద్దతుగా మాట్లాడారు. దీంతో అతడిపై కక్ష కట్టి... దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.

అయితే శివబాలాజీ  గతంలో కూడా తన ఫేస్‌బుక్‌లో అసభ్యకర కామెంట్లు చేసిన ఓ వ్యక్తిపై  సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమాలో హీరో తమ్ముడి పాత్రలో శివబాలాజీ నటించాడు. దానికి సంబంధించిన నాలుగు ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన అతడు.. డబ్బింగ్ పనులను పూర్తి చేశామంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోలను పొగుడుతూ చాలా మంది కామెంట్లు పెట్టగా...వాసు అనే యువకుడు మాత్రం అసభ్య పదజాలంతో కామెంట్స్‌ పెట్టాడు. దీంతో ఆ కామెంట్‌తో సహా ఫొటోను స్క్రీన్ షాట్ తీసి.. ‘ఎందుకు? నాకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నీ ఈ తిట్ల వల్ల నేను నీమీద కేసు పెట్టొచ్చు తెలుసా?’ అంటూ శివబాలాజీ ఓ లింక్‌ను పోస్ట్ చేశాడు. అయితే ఆ యువకుడు మరింత రెచ్చిపోవడంతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయంలోలో శివబాలాజీ ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement