రంజిత బాధితురాలు కాదు కాబట్టి.. | Nithyananda Swami Arrest Warrant Cancelled | Sakshi
Sakshi News home page

నిత్యానంద అరెస్ట్‌ వారెంట్‌ రద్దు

Jan 18 2019 11:59 AM | Updated on Jan 18 2019 11:59 AM

Nithyananda Swami Arrest Warrant Cancelled - Sakshi

నిత్యానందస్వామి, రంజిత (ఫైల్‌)

కర్ణాటక, దొడ్డబళ్లాపురం : అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానందస్వామిజీపై కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను రామనగర కోర్టు రద్దు చేసింది. నిత్యానంద అనేకసార్లు కేసు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు గత ఏడాది సెప్టెంబర్‌ 6న అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

దీంతో నిత్యానంద కోర్టుకు అర్జీ సమర్పించగా విచారణ జరిపిన జిల్లా సింగిల్‌ బెంచ్‌ కోర్టు జడ్జీ దినేశ్‌కుమార్‌ సదరు అరెస్టు వారెంట్‌ను రద్దు చేస్తూ తీర్పు నిచ్చారు. ఇదే కేసులో మరో నిందితుడు శివ వల్లభనేని అనే వ్యక్తిపై జారీ చేయబడిన అరెస్టు వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. ఇదే సందర్భంగా సినీనటి రంజిత నిత్యానందపై ఉన్న అత్యాచారం కేసులో ప్రాసిక్యూషన్‌కు సహాయంగా ఉండడానికి అవకాశం కల్పించాలని పెట్టుకున్న అర్జిని కొట్టేసిన తీర్పును ప్రశ్నిస్తూ మరోసారి పెట్టుకున్న అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. రంజిత బాధితురాలు కాదు కాబట్టి ఆమె పెట్టుకున్న అర్జీని తిరస్కరించడం సబబుగానే ఉందని కోర్టు మరోసారి అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement