జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్

New Twist In JC Travels Forgery Case - Sakshi

సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. బీఎస్‌-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్‌-4గా మార్పుచేసి రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు అధికారులు గుర్తించారు. 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. 60 వాహనాలను రవాణా అధికారులు సీజ్‌ చేశారు. మిగతా 94 వాహనాలను జేసీ బ్రదర్స్‌ అజ్ఞాతంలో దాచిపెట్టారు. వాటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నట్లు అధికారులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్‌ వాహనాల్లో ప్రయాణించే వారికి ఇకపై  ఇన్సూరెన్స్‌ వర్తించదని అధికారులు తేల్చి చెప్పారు. 

జేసీ ట్రావెల్స్ చాలా తప్పులు చేసింది
జేసీ ట్రావెల్స్‌ చాలా తప్పులు  చేస్తూ, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడిందని అనంతపురం డిప్యూటి ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ శివరాంప్రసాద్‌ అన్నారు. స్క్రాప్‌ కింద కొనుగోలు చేసిన బస్సులు, లారీలను రోడ్లపై నడపడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దమని పేర్కొన్నారు. ఈ విషయంపై జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందిస్తామని చెప్పారు. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు శివరాంప్రసాద్‌ పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top