70 ఇళ్లలో గ్యాస్‌ పేలుళ్లు..ఆరుగురికి గాయాలు | Multiple Explosions At Merrimack Valley In Massachusetts | Sakshi
Sakshi News home page

70 ఇళ్లలో గ్యాస్‌ పేలుళ్లు..ఆరుగురికి గాయాలు

Sep 14 2018 7:07 AM | Updated on Apr 4 2019 3:25 PM

 Multiple Explosions At Merrimack Valley In Massachusetts - Sakshi

అమెరికా: మస్సాచుసెట్స్‌ రాష్ట్రం మెర్రిమాక్‌ వ్యాలీలోని అండోవర్‌ పట్టణంలో గురువారం గ్యాస్‌ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతాన్ని అంతా అధికారులు ఖాళీ చేయించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గ్యాస్‌ లైన్‌ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సుమారు 10 ఇళ్ల నుంచి ఫైర్‌ అలారమ్‌లు మోగాయని, దీంతో వెంటనే 50 ఫైరింజన్లు, 10 అంబులెన్స్‌లు సంఘటనాస్థలానికి చేరుకున్నాయని స్థానిక అధికారులు తెలిపారు.

సుమారు 70 ఇళ్లలో గ్యాస్‌ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెప్పారు. 38 చోట్ల మంటలను అదుపులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. తన కెరీర్‌లో ఇటువంటి సంఘటన ఎన్నడూ చూడలేదని, పట్టణంలో ఒక యుద్ధ భూమి వాతావరణం కనిపించిందని అగ్నిమాపక శాఖ స్ధానిక అధికారి మైకేల్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement