ప్రేమికుడి తల్లిని స్తంభానికి కట్టేసి..

Mother Torcher By Sons Partner Father In Tamilnadu - Sakshi

చిత్రహింసలు పెట్టిన ప్రియురాలి తండ్రి

టీ.నగర్‌: విరుదాచలం సమీపంలో ప్రేమ వివాహానికి వ్యతిరేకత తెలుపుతూ ప్రియురాలి తండ్రి ప్రేమికుడి తల్లిని శుక్రవారం విద్యుత్‌ స్తంభానికి కట్టి చిత్రహింసలకు గురిచేయడం ఆ ప్రాంతంలో సంచలం రేపింది. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని విలాంగట్టూరు గ్రామానికి చెందిన పొన్నుసామి భార్య సెల్వి (45). ఈమె కుమారుడికి అదే ప్రాంతానికి చెందిన బంధువు కొలుంజి (60) కుమార్తెతో ప్రేమ ఏర్పడింది. ఇలావుండగా గత నెల ఇరువురూ ఇల్లు విడిచి పరారైనట్లు సమాచారం. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం సెల్వి ఇంటి ముందు నిలుచుని ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కొలుంజి తన కుమార్తెను ఎక్కడ ఉంచారో చెప్పు! అంటూ ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ అక్కడున్న విద్యుత్‌ స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సెల్విని రక్షించి విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. సెల్వి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కొలుంజిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top