ఇద్దరు పిల్లలు సహా గృహిణి అదృశ్యం | Mother And Two Children Missing in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలు సహా గృహిణి అదృశ్యం

Feb 18 2020 9:53 AM | Updated on Feb 18 2020 9:53 AM

Mother And Two Children Missing in Hyderabad - Sakshi

మెహాక్‌ బేగం, ఫూల్‌ భాను, బషీర్‌ (ఫైల్‌)

చాంద్రాయణగుట్ట: కూరగాయలకని ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పుగూడ లలితాబాగ్‌ ప్రాంతానికి చెందిన నసీర్‌ హుస్సేన్‌ మాలిక్, మెహాక్‌ బేగం (30)లు దంపతులు. వీరికి కూతురు ఫూల్‌ భాను (12), కుమారుడు బషీర్‌ (8)లు సంతానం ఉన్నారు. ఈ నెల 14న రాత్రి 7 గంటలకు మెహాక్‌ బేగం తన ఇద్దరు పిల్లలు భాను, బషీర్‌లతో కలిసి ఉప్పుగూడ జెండా వద్ద కూరగాయల కోసమని ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో భర్త నసీర్‌ హుస్సేన్‌ మాలిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040– 27854788లో సమాచారం అందించాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement