హీరోయిన్‌ కారు ముందు మూత్రం పోశాడు | Monal Gajjar Complaints Man Urinate in front of Her Car | Sakshi
Sakshi News home page

Mar 8 2018 8:03 PM | Updated on Oct 9 2018 5:39 PM

Monal Gajjar Complaints Man Urinate in front of Her Car - Sakshi

అహ్మదాబాద్‌ : నటి మోనాల్‌ గుజ్జర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన కారు ముందు మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్న ఆమె.. అతని చేతిలో తిట్లు తింది. దీంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేయగా.. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ధోలీవుడ్‌(గుజరాత్‌ ఇండస్ట్రీ) తార మోనాల్‌ రెండు రోజుల క్రితం సాయంత్రం గుల్బై టెక్రాలోని ఓ కాఫీ షాప్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె పార్కింగ్‌ చేసిన కారు ముందు మూత్ర విసర్జన చేస్తున్నాడు. వెంటనే అది గమనించిన ఆమెలో కూర్చుని కారు హారన్‌ కొడుతూ అతన్ని వారించింది. అయినా ఆ వ్యక్తి తన పని కానిచ్చేసి ఆమె వైపుగా వచ్చాడు. హారన్‌ ఎందుకు కొట్టావంటూ మోనాల్‌తో వాగ్వాదానికి దిగాడు.

అలా చెయ్యటం ఆమె తప్పని చెబుతుండగా.. అసభ్యపదజాలంతో తిట్టడం ప్రారంభించాడు. ఆ వ్యవహారమంతా ఆమె తన ఫోన్‌లో వీడియో తీసింది. మరుసటి రోజు గుజరాత్‌ యూనివర్సిటీ పోలీసులకు మోనాల్‌ ఫిర్యాదు చేసింది. అతన్ని అదుపులోకి తీసుకోగా.. తన కాంప్లెక్స్‌లో బాత్రూమ్‌లు పాడైపోయాయని.. అందుకే అలా చేశానని చెప్పుకొచ్చాడు. మోనాల్‌ సుడిగాడు, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ చిత్రాలతో తెలుగువారికి పరిచయస్తురాలే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement