
విజయనగరం జిల్లాలో మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది.
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. అదృశ్యమైన మహిళను ఆమె భర్తే హతమార్చినట్టు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వెంకంపేట ఏజెన్సీ ప్రాంతానికి చెందిన చిటికల రమణమ్మ గత ఏడాది అక్టోబర్ 15న అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రమణమ్మ కనిపించని రోజు నుంచి ఆమె భర్త నర్సయ్య పరారయ్యాడు. దీంతో పోలీసులు భర్తపై అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
ఎట్టకేలకు నర్సయ్యను పట్టుకున్న పోలీసులు తమదైన రీతిలో విచారించడంతో అసలు నిజలు భయటపడింది. భార్య రమణమ్మను చంపిన నర్సయ్య బాత్‌రూంలో పాతిపెట్టి పైన ప్లాస్టరింగ్ చేసినట్టు విచారణలో వెల్లడించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రమణమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.