పూణేలో ఘోరం : లైంగిక దాడితో బాలిక బలి | Minor Girl Gang Raped By Two Dies In Hospital | Sakshi
Sakshi News home page

పూణేలో ఘోరం : లైంగిక దాడితో బాలిక బలి

Sep 20 2018 2:57 PM | Updated on Sep 20 2018 3:50 PM

Minor Girl Gang Raped By Two Dies In Hospital - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

షాకింగ్‌ : సామూహిక లైంగిక దాడిలో బాలిక మృతి

పూణే : మహారాష్ట్రలో దారుణం చోటుచేసకుంది. మూడు రోజుల కిందట మరో మైనర్‌ బాలికతో కలిసి ఇద్దరు కామాంధుల చేతిలో లైంగిక దాడికి గురైన 12 ఏళ్ల బాలిక గురువారం పూణే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. హింజెవాది ప్రాంతంలో ఆదివారం సామూహిక లైంగిక దాడి ఘఢన జరగ్గా బాధితురాళ్లను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు బాలికల్లో కోమాలోకి వెళ్లిన ఓ బాలిక బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించారు. ఈ ఘటనకు సంబంధించి 22 ఏళ్ల యువకుడితో పాటు ఓ మైనర్‌ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు బాలికలు ఆదివారం దేవాలయానికి వెళ్లగా నిందితులు వారికి చాక్లెట్లు ఇస్తామని చెప్పి నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. లైంగిక దాడి గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితులు బాలికలను హెచ్చరించారని చెప్పారు. ఇంటికి వెళ్లిన అనంతరం ఓ బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించిన మీదట లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది.

మరో బాలికను విచారించగా మొత్తం ఘటన బయటపడిందని, నిందితులపై పోస్కో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. బాలిక మరణంతో నిందితులపై హత్యానేరం అభియోగాలు కూడా చేర్చామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement