ప్రియుడి కోసం సరిహద్దు 'గోడ' దూకడంతో.. | Mexican woman injured critically while jumped into USA border | Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం సరిహద్దు 'గోడ' దూకడంతో..

Feb 12 2018 12:05 PM | Updated on Apr 4 2019 3:25 PM

Mexican woman injured critically while jumped into USA border - Sakshi

మెక్సికో-అమెరికా సరిహద్దు

వాషింగ్టన్: తన ప్రియుడితో కలిసి షికారుకు వెళ్లిన ఓ యువతి అతడి కోసం ఏకంగా దేశ సరిహద్దు గోడ దూకేసింది. ప్రియుడి వరకూ అంతా ఓకే కానీ, గోడ దూకిన ప్రియురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైంది. ఆ వివరాళ్లోకెళ్తే.. మెక్సికోకు చెందిన 22 ఏళ్ల యువతి, 44 ఏళ్ల వ్యక్తి గాఢంగా ప్రేమించుకున్నారు. విహారానికి వెళ్లాలనుకున్న ఈ ప్రేమజంట మెక్సికో సరిహద్దు వద్దకు చేరుకున్నారు.
 
ప్రియుడి కోరిక మేరకు, అతడితో కలిసి అమెరికా-మెక్సికో సరిహద్దుకు చేరుకున్నారు. 20 అడుగుల ఎత్తున్న ప్రాంతం నుంచి దూకి అమెరికా ఇంపీరియల్ కౌంటీ ఆక్టోటిల్లోకి ప్రవేశించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అమెరికా బార్డర్ పాట్రోలింగ్ పోలీసులు వీరిని గమనించి అక్కడికి వచ్చి చూడగా యువతి తీవ్రంగా గాయపడి ఉన్నట్లు గుర్తించారు. ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించగా వెన్నెముకకు గాయమైనట్లు డాక్టర్లు తెలిపారు.

మెక్సికో పోలీసులకు వీరిని అప్పగించగా ప్రియుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని మెక్సికో సరిహద్దు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సరిహద్దు వద్దకు విహారానికి వెళ్లిన తమ జంట పొరపాటున 20 అడుగుల ఎత్తు నుంచి అమెరికా భూభాగంలోకి జారి పడిపోయామని పోలీసులకు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement