సెంట్రల్ జైల్‌ నుంచి విడుదలైన మారుతిరావు

Maruthi Rao Released From Warangal Central Jail - Sakshi

సాక్షి, వరంగల్‌/ మిర్యాలగూడ టౌన్: ‌ మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడైన తిరునగరు మారుతిరావు ఆదివారం ఉదయం వరంగల్‌ సెంట్రల్‌ జైలు నుండి విడుదలయ్యాడు. ఆయనతోపాటు మరో ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలు కూడా విడుదలయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఈ ముగ్గురికి హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన మారుతిరావు, ఆయన సోదరుడిని కుటుంబసభ్యులు వెంట తీసుకెళ్లారు.

ప్రణయ్‌ హత్యకేసులో నిందితులైన వీరిపై గత ఏడాది సెప్టెంబర్‌ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న మారుతీరావు, శ్రవణ్‌కుమార్, ఖరీంలు బెయిల్‌ కోసం రెండు నెలల క్రితమే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆ సమయంలో జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె.శ్రీనివాస్‌లు బెయిల్‌ ఇవ్వరాదని గట్టిగా వాదించారు. దాంతో హైకోర్టు నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, పీడీ యాక్టు కేసులో బెయిల్‌ కోరుతూ నిందితులు ముగ్గురు ఇటీవల హైకోర్టులో మరోసారి పిటిషన్‌ దాఖ లు చేయగా విచారించిన కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది.

చదవండి: మారుతీరావుతో మా కుటుంబానికి ముప్పు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top