మరణదండన తప్పదు | Maoists Warnings To People In Orissa | Sakshi
Sakshi News home page

మరణదండన తప్పదు

Apr 23 2018 7:34 AM | Updated on Oct 9 2018 2:53 PM

Maoists Warnings To People In Orissa - Sakshi

చెట్టుకు అతికించిన పోస్టర్‌ 

జయపురం : కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ సమితి దండాబడి గ్రామం సమీపంలో మావోయిస్టుల పోస్టర్లు వెలి శాయి. దండాబడి గ్రామ పంచాయతీ కలియఝోలి గ్రామం జంక్షన్‌కు, రామగిరి పంచాయతీ దాదరఖొ ల గ్రామం జంక్షన్‌ మధ్య సుమారు 50 చోట్ల పో స్టర్లు అంటించారు. సీపీఐ(మావోవాది)ఎం, కేవీ బీ డివిజన్‌ కమిటీ పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో కాంట్రాక్టర్లకు, యువకులకు హెచ్చరికలు చేశారు. ఐదుగురు కాంట్రాక్టర్లు, ఐదుగురు యువకుల పేర్లు, వారి చిరునామాలు వెల్లడిం చారు. ఈ 10 మందికి మరణ శిక్ష విధిస్తామని పోస్టర్లలో హెచ్చరించారు. ఈ ఐదుగురు యువకులు ఆ ప్రాంతంలోని నిరుపేదలకు శ త్రువులని పేర్కొన్నారు. ఐదుగురు కాంట్రాక్టర్లలో ముగ్గురికి అతి వేగంగా మరణదండన విధిస్తామని హెచ్చరించారు.

అలాగే గ్రామాల అభివృద్ధికి నేతలు, అధికారులు ఎంతో చేస్తున్నామని చెపుతున్నారని అయితే ఆ అభివృద్ధి ఎక్కడా కనిపించటం లేదని వెల్లడిస్తూ, ఈ వ్యవస్థను అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా గత ఆదివారం ఇదే ప్రాంతంలో వారపు సంతలో సాయంత్రం తుపాకుల తూటాల వర్షం కురిసింది. మాజీ సర్పంచ్‌ భర్త ఆనంద నాయిక్‌ అనే కంట్రాక్టర్‌పై మవోయిస్టులు విచక్షనా రహితంగా కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మరువకముందే ఇదే ప్రాంతంలో ఇప్పుడు మావోయిస్టుల పోస్టర్లు వెలియడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పలు చోట్ల పోస్టర్లు చూచి ప్రజలు భయంతో వణుకుతున్నారు.

మావోయిస్టుల హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఎప్పుడు ఎవరిని హతమార్చుతారో అన్న భయం అందరిలో నెలకొంది. మావోల పోస్టర్ల విషయం తెలిసిన వెంటనేపోలీసులు, బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌ జవాన్లు వెళ్లి పోస్టర్లను తొలగించారు. ఈ పోçస్టర్లపై దర్యాప్తు జరుపుతున్నట్టు బొయిపరిగుడ పోలీసు అధికారులు వెల్లడించారు. బొయిపరిగుడ ఒకప్పుడు మావోల అడ్డాగా ఉన్నా కొంత కాలం నుంచి ఇక్కడ వారి ఉనికి కనిపించలేదు. అయితే కొద్ది రోజులుగా మరలా మావోయిస్టులు ఈ సమితిలో సంచరిస్తూ తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement