మానవత్వానికే మచ్చలాంటి ఘటన.. | Man Raped Mother in Palanpur Gujarat | Sakshi
Sakshi News home page

Apr 23 2018 1:17 PM | Updated on Oct 9 2018 5:39 PM

Man Raped Mother in Palanpur Gujarat - Sakshi

అహ్మదాబాద్‌ : మానవత్వానికే మచ్చలాంటి ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. అశ్లీలతకు అలవాటు పడిపోయిన ఓ యువకుడు కన్నతల్లినే చెరపట్టాడు. దిగ్భ్రాంతికి గురి చేసే అ ఘటన గుజరాత్‌లోని బనసకాంత జిల్లా పలన్‌పూర్‌ నగరంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళ్తే.. పఠాన్‌ టౌన్‌లో రాకేశ్‌(22) కుటుంబం నివసిస్తోంది. రాకేశ్‌ తండ్రి తాపీ మేస్త్రీ. పనుల నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతుంటాడు. సోదరుడు అహ్మదాబాద్‌లో స్థిరపడగా కాగా, రాకేశ్.. తన తల్లి, సోదరి(20)లతో స్థానికంగా  జల్‌ చౌక్‌లో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా రాకేశ్‌ పోర్న్‌కు బానిసయ్యాడు. గత గురువారం రాత్రి మంచి నీళ్ల వంకతో తల్లి గదిలోకి వెళ్లిన యువకుడు.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె అరుస్తూ అతన్ని ప్రతిఘటించింది. అయితే వారిద్దరి మధ్య గతంలో తరచూ గొడవలు చోటు చేసుకోవటంతో.. కూతురు, చుట్టు పక్కల వాళ్లు ఆ అరుపులను పెద్దగా పట్టించుకోలేదు. 

చివరకు ఈ దారుణాన్ని భర్తకు వివరించిన మహిళ.. కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ‘ రాకేశ్‌ ఒక్కోసారి తమ ముందే బూతు వీడియోలు చూసేవాడని.. కోరిక తీర్చమంటూ వేధించేవాడని’ ఆ తల్లికూతుళ్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్‌ చేసి.. అతని ఫోన్‌, ల్యాప్‌ ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. దారుణానికి తెగబడే ముందు వరకు యువకుడు అశ్లీల వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది. ఐపీసీ సెక్షన్లు 376, 507 ప్రకారం రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

                  నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పఠాన్‌ టౌన్‌ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement