ప్రేయసిపై కోపం.. చిన్నారి గొంతుకోసి | Man Murdered Six Year Old Baby In Medchal | Sakshi
Sakshi News home page

ప్రేయసిపై కోపం.. చిన్నారి గొంతుకోసి

Jul 2 2020 4:02 PM | Updated on Jul 2 2020 10:11 PM

Man Murdered Six Year Old Baby In Medchal - Sakshi

మేడ్చల్‌ : తల్లి అక్రమ సంబంధం అభంశుభం తెలియని ఓ చిన్నారిని బలి తీసుకుంది. తల్లి చేసిన తప్పిదానికి ఓ నిండు ప్రాణం బలైంది. భర్తలేని సమయంలో ప్రియుడుతో పెట్టుకున్న అక్రమ సంబంధం చివరికి తన కూతురిని తన నుంచి శాస్వతంగా దూరం చేసింది. ఆరేళ్ల చిన్నారిని ఓ కిరాతకుడు గొంతుకోసి దారుణంగా హత్యచేసిన ఘటన మేడ్చల్‌ జిల్లాలో కలకలం రేపింది. ఘట్‌కేసర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుషా-కళ్యాణ్‌ దంపతులకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వారిద్దరికి ఆద్య అనే ఆరేళ్ల కూతురు ఉంది. కొంతకాలం కిందట అనుషాకు కరుణాకర్‌ అనే మరో యువకుడితో పరిచయం ఏర్పడగా.. అది అక్రమ సంబంధానికి దారితీసింది. విషయం కాస్తా భర్తకు తెలియడంతో అనుషను తీవ్రంగా మందలించాడు. ఆ తరువాత ఆమె తన ప్రవర్తనను మార్చుకుని కరుణాకర్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. దీంతో ప్రియురాలిపై తీవ్ర కోపం తెచ్చుకున్న ప్రియుడు అనుషా కూతురు ఆద్యను చంపాలని కుట్ర పన్నాడు.

అనుకున్నట్లుగానే గురువారం మధ్యాహ్నాం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి అనుషపై దాడికి యత్నించి వెంట తెచ్చుకున్న సర్జికల్ కత్తి ఆద్య గొంతు కోశాడు. ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమచారం ఇవ్వడంతో రక్తపు మడుగులో కొట్టుకుంటున్న పాపను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికి తీవ్ర రక్తస్రావం కావడం చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలను విడిచింది. నిందితుడు కరుణాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement