పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య | Man Commits Suicide in Vizianagaram | Sakshi
Sakshi News home page

పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

Dec 25 2018 6:05 AM | Updated on Dec 25 2018 9:20 AM

Man Commits Suicide in Vizianagaram - Sakshi

మృతుడు డప్పుకోట రవికుమార్‌ , మృతుడి జేబులో ఉన్న లేఖ

మృతుడి జేబులో సూసైడ్‌ నోట్‌

విజయనగరం, పార్వతీపురం: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన  పార్వతీపురంలో చోటు చేసుకుంది. వైకేఎం కాలనీలో నివాసం ఉంటున్న డప్పుకోట రాజారావు, సరోజనమ్మల కుమారుడు డప్పుకోట రవికుమర్‌ (27) ఆదివారం రాత్రి 3.30 గంటల సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే రవికుమార్‌ మృతి చెందాడు. అవుట్‌ పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై మృతుడు రవికుమార్‌ తండ్రి రాజారావు మాట్లాడుతూ, తన కుమారుడు కడుపునొప్పితో కొద్ది రోజులుగా బాధపడుతున్నాడని చెప్పారు. ఆది వారం రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఫిర్యాదులు పేర్కొన్నారు.

మృతుడి జేబులో లేఖ...
మృతుడు రవికుమార్‌ జేబులో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో కల్యాణి అనే మహిళ, ఆమె తండ్రితో పాటు భర్త తన చావుకు కారణమని రాసి ఉంది. గరుగుబిల్లి మండలం పెద్దూరు.. జియ్యమ్మవలస మండలానికి చెందిన కొందరు తనను చంపాలనుకుంటున్నారని వారి ఫోన్‌ నంబర్లుతో సహాలేఖ రాసి జేబులో పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే మృతుడి జేబులో లేఖ ఉన్నప్పటికీ.. పోలీసులు మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement