బాలికను గర్భవతిని చేసి వదిలేసిన యువకుడు

Man Cheated Girl Child With Love Affair And Pregnant in Rangareddy - Sakshi

రంగారెడ్డి, కొత్తూరు: ప్రేమపేరుతో బాలికను నమ్మించి గర్భవతిని చేసి ఓ యువకుడు వదిలేశాడు. పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ అంటూ వదిలేయడంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని మక్తగూడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేందర్‌ (21), బాలిక ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమమాయలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట కుటుంబసభ్యులు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. బాలికను వివాహం చేసుకోనని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. దీంతో తనకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై సీఐ చంద్రబాబును వివరణ కోరగా బాలిక ఫిర్యాదు వాస్తవమేనన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top