గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య   | Man Brutally Murdered in Mahabubnagar | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య  

Jul 5 2019 11:12 AM | Updated on Jul 5 2019 11:13 AM

Man Brutally Murdered in Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హతమార్చి.. గుర్తుపట్టడానికి రాకుండా పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన కనిమెట్ట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గురువారం స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కనిమెట్ట గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన గల ఓ బ్రిడ్జి కింద దాదాపు 35 సంవత్సరాల వయ స్సు గల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారు.

అనంతరం ఆనవాళ్లు దొరకుండా ఉండేందుకు శవం పై, వస్తువులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించా రు. అక్కడికి చేరుకున్న పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం పక్కనే పడి ఉన్న టిఫిన్‌ బాక్సుపై నిందితుల వేలిముద్రలను సేకరించారు. అనంతరం డాగ్‌స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలించగా.. కొంతదూరం వెళ్లి అక్కడే ఆగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఎస్పీ వెంట స్థానిక సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ రవికాంత్‌రావు, ట్రైనింగ్‌ ఎస్‌ఐ హరీష్, ఏఎస్‌ఐ రోశన్న హెడ్‌కానిస్టేబుల్‌ వేమారెడ్డి, కానిస్టేబుళ్లు మహేష్, వెంకట్‌రెడ్డి, యుగంధర్‌గౌడ్‌ తదితరులున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement