వెనుక నుంచి వచ్చి.. గొంతు నులిమి : వైరల్‌

Man Attacked Woman And Robbed Her In New Delhi CCTV Records - Sakshi

న్యూఢిల్లీ : వీధిలో ఒంటరిగా వెళుతున్న యువతిని చేతులతో బంధించి ఆమె మెడలోని బంగారు నగలను, మొబైల్‌ ఫోన్‌ను దోచుకెళ్లాడు ఓ దొంగ. ఈ సంఘటన న్యూఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే న్యూఢిల్లీలోని మాన్‌సరోవర్‌ పార్క్‌ ఏరియాలో ఓ యువతి రాత్రి 8-30గంటల సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. ఓ‍ దొంగ ఆ యువతిని కొద్దిదూరం అనుసరించాడు. అదును చూసి ఆమెను గట్టిగా చేతులతో బంధించి పట్టుకున్నాడు.

ఆ యువతి విడిపించుకోవటానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. పెనుగులాటలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును, మొబైల్‌ ఫోన్‌ లాక్కుని అక్కడినుంచి పరుగులు తీశాడు. అక్కడే ఆ దొంగ కోసం వేచి ఉన్న  బైక్‌లో ఎక్కి అక్కడినుంచి పరారయ్యాడు. నిస్సహాయురాలైన ఆ యువతి మెల్లగా లేచి సహాయం కోసం చూసి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top