మలేషియా మహిళ అదృశ్యం | malaysian woman Missing In Tamil Nadu | Sakshi
Sakshi News home page

మలేషియా మహిళ అదృశ్యం

Aug 11 2018 9:41 AM | Updated on Aug 11 2018 9:41 AM

malaysian woman Missing In Tamil Nadu - Sakshi

అదృశ్యమైన భువన

నిద్రలేచి చూడగా భార్య కనిపించలేదు. అన్ని చోట్ల వెదికినా ఆచూకీ లభించలేదు. ఆమె లాడ్జి గది నుంచి హ్యాండ్‌ బ్యాగ్, పాస్‌పోర్టు, సెల్‌ఫోన్‌ తీసుకెళ్లినట్లు తెలిసింది

టీ.నగర్‌: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా, మేట్టుపాళయంలో భర్తతోపాటు విహారయాత్రకు వచ్చిన మలేషియా మహిళ గురువారం అదృశ్యమైంది. వివరాలు.. మలేషియా షాంగై పట్టానికడా, తామన్‌డేసాజయా ప్రాంతానికి చెందిన శివనేశన్‌ (34) వంటపని చేస్తుంటారు. ఇతని భార్య భువన (34) కొరియర్‌ సంస్థ కార్యాలయంలో పనిచేస్తోంది. పదేళ్ల క్రితం వారికి వివాహమై ప్రగతి (9), జనని (6) అనే ఇద్దరు కుమార్తెలున్నారు.

భార్యాభర్తలు తమిళనాడులో పర్యటించేందుకు 2వ తేదీన మలేషియా నుంచి విమానం ద్వారా చెన్నై చేరుకున్నారు. చెన్నైలోనే బసచేసి అనేక ఆలయాలను సందర్శించారు. 8వ తేదీన ఊటీ వెళ్లేందుకు రాత్రి 11.30 గంటల సమయంలో మేట్టుపాళయం చేరుకున్నారు. అక్కడున్న ఒక లాడ్జిలో రూం తీసుకుని బస చేశారు. గురువారం ఉదయం శివనేశన్‌ నిద్రలేచి చూడగా భార్య కనిపించలేదు. అన్ని చోట్ల వెదికినా ఆచూకీ లభించలేదు. ఆమె లాడ్జి గది నుంచి హ్యాండ్‌ బ్యాగ్, పాస్‌పోర్టు, సెల్‌ఫోన్‌ తీసుకెళ్లినట్లు తెలిసింది. సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. ఫిర్యాదు మేరకు మేట్టుపాళయం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement