ప్రేమజంట ఆత్మహత్యాయత్నం | lovers sucide | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Feb 14 2018 3:39 AM | Updated on Feb 14 2018 3:39 AM

lovers sucide - Sakshi

కాజీపేట అర్బన్‌: భక్తులంతా శివనామ స్మరణలో లీనమైపోగా ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరాలయ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రియురాలు మార్గ మధ్యంలో మృతిచెందగా, ప్రియుడు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

పాఠశాలలోనే సాన్నిహిత్యం..
హన్మకొండ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేటకు చెందిన మేర్గు రమేశ్‌కుమార్, శ్రీదేవి దంపతుల కుమార్తె హరిప్రియ(17)కు, సమీపంలోని దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన పైండ్ల సమ్మయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు సాయికుమార్‌(17)కు మధ్య వరంగల్‌ నగరంలోని ఓ పాఠశాలలో చదివే సమయంలో సాన్నిహిత్యం పెరిగింది. పదో తరగతి పూర్తయ్యాక వేర్వేరు కళాశాలల్లో పాలిటెక్నిక్‌ చదువుతున్న వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. విషయం తెలిసిన హరిప్రియ తండ్రి గత కొద్దిరోజుల కిందట ఆమెను మందలించాడు.

కాగా, సోమవారం మధ్యాహ్నం హరిప్రియ దీన్‌దయాళ్‌నగర్‌లోని సాయికుమార్‌ ఇంటికి చేరుకుంది. అక్కడి నుంచి ఇద్దరు కలిసి కాళేశ్వరం వెళ్లారు. కాళేశ్వరాలయం వద్ద వారిద్దరు సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి నురగులు కక్కుతూ పడిపోగా గమనించిన భక్తులు, స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే చేరుకొని 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మహదేవపూర్‌కు చేరుకునే సరికే హరిప్రియ మృతిచెందింది. సాయికుమార్‌ ప్రస్తుతం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement