భూ యజమానిపై దాడి.. వీడియో వైరల్‌!

Land Disputes Video In Mahabubabad Goes Viral In Telangana - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : కౌలుకిచ్చిన భూమి తనదేనంటూ ఎదురుతిరిగి దాడి చేసిన ఘటన శుక్రవారం వావిలాల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వివరాలు.. కళ్యాణి అనే మహిళకు సంబంధించిన నాలుగెకరాల భూమిని బానోత్‌ తేజ కౌలుకు తీసుకున్నాడు. కళ్యాణి అన్న ప్రమాదంలో చనిపోగానే.. ఆ భూమి తనదేనంటూ ఆ మహిళపై తిరగబడ్డాడు. బానోత్‌ తేజ భార్య భూమి యజమానురాలిపై దాడికి దిగింది. బాధితురాలు ప్రతిఘటించడంతో గొడవ పెద్దైంది. అక్కడున్న వీరిద్దరినీ విడదీశారు.

బాధితురాలు కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అన్న చనిపోగానే ఇలా మాట మార్చాడని, రూ. 75 వేలు అప్పు ఉన్నట్లు.. అది చెల్లిస్తే గానీ భూమి ఇచ్చేది లేదంటున్నాడని ఫిర్యాదు చేశారు. కౌలుకు తీసుకున్న ఆ రైతు కుటుంబం తనపై దాడి చేసిందంటూ సాక్ష్యంగా ఓ వీడియోను పోలీసులకు సమర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top