ఖమ్మం డీసీసీ అధ్యక్షుడి మృతి | Khammam DCCC president died | Sakshi
Sakshi News home page

ఖమ్మం డీసీసీ అధ్యక్షుడి మృతి

Apr 6 2018 10:28 AM | Updated on Mar 18 2019 9:02 PM

Khammam DCCC president died - Sakshi

ఐతం సత్యంతో మల్లు భట్టివిక్రమార్క(పాత ఫొటో)

సాక్షి, ఖమ్మం : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. సత్యం మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, నాయకులు మల్లు రవి తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సత్యం కొంత కాలంగా కాన్సర్ వ్యాధితో బాధ పడుతూ హైదరాబాద్‌లోని మాక్స్‌క్యూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పరిస్థితి విషమించి ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. సత్యం భౌతికకాయాన్ని ఖమ్మం తరలించి ప్రజల సందర్శనార్థం డీసీసీ కార్యాలయంలో కొద్ది సేపు ఉంచుతారు. సత్యం మరణ వార్త తెలియగానే టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వరంగల్ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement