కశ్మీర్‌లో బీజేపీ నేత హత్య

kashmir in bjp leader murder - Sakshi

జమ్మూ: కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కిస్త్వర్‌ జిల్లా కేంద్రంలో తమ దుకాణం నుంచి గురువారం రాత్రి ఇంటికి వెళుతున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అనిల్‌ పరిహార్, అతని సోదరుడు అజిత్‌పై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. కాల్పుల శబ్దాలు విన్న స్థానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తేల్చారు. ఈ విషయమై జమ్మూ డివిజినల్‌ కమిషనర్‌ సంజీవ్‌ వర్మ మాట్లాడుతూ.. అనిల్, అజిత్‌ల రాక కోసం ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేశారని తెలిపారు. వారు సమీపించడంతో పిస్టళ్లతో కాల్పులు జరిపి పారిపోయారని వెల్లడించారు. మరోవైపు ఈ హత్యలకు నిరసనగా ఆందోళనకు దిగిన ప్రజలు.. పోలీస్‌ సిబ్బందిపై చేయిచేసుకున్నారు. దీంతో అధికారులు కిస్త్వర్‌ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top