లైంగిక వేధింపుల కేసులో జడ్జి అరెస్ట్‌ | Judge Arrested In Molestation Case | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసులో జడ్జి అరెస్ట్‌

Aug 15 2018 2:09 AM | Updated on Aug 31 2018 8:47 PM

Judge Arrested In Molestation Case - Sakshi

సత్యనారాయణ

హైదరాబాద్‌/తుంగతుర్తి: ప్రేమపేరుతో దళిత యువతిని మోసం చేసిన జడ్జిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జూనియర్‌ సివిల్‌ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న సత్యనారాయణరావు హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఉంటున్న ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన సివిల్‌ కోర్టు మహిళా న్యాయవాది రజిని ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఇటీవల సత్యనారాయణరావు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నారు.

ఈ విషయమై సత్యనారాయణరావును నిలదీయగా అతడితో పాటు ఆయన తల్లి రజినీపై దాడి చేసి కులం పేరుతో దూషించారు. దీంతో ఈ నెల 4న ఆమె చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు సత్యనారాయణరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్‌ కేసు నమోదు చేశారు. హైకోర్టు అనుమతితో అతడిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement