అమెరికా వ్యాపారి జైలులో ఆత్మహత్య

Jeffrey Epstein dead after apparent suicide in New York jail - Sakshi

ట్రంప్‌ వంటి ప్రముఖులతో సంబంధాలు

న్యూయార్క్‌: బాలికల విక్రయం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి జెఫ్రీ ఎప్‌స్టీన్‌(66) జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. బాలికలను, ముఖ్యంగా 14 ఏళ్లలోపు వారిని విక్రయిస్తున్నాడన్న ఆరోపణలపై అతడు ప్రస్తుతం మన్‌హట్టన్‌లోని మెట్రోపాలిటన్‌ కరెక్షనల్‌ జైలులో ఉన్నాడు. ఎప్‌స్టీన్‌ గతంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు క్లింటన్, బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ వంటి పలువురు రాజకీయనేతలు, సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు సాగించేవాడు. మన్‌హట్టన్, పామ్‌బీచ్‌లలోని తన నివాసాల్లో 2002–2005 మధ్య టీనేజీ బాలికలను వాడుకోవడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఆరోపణలు రుజువైతే 45 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top