విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు | Jammu Hostel Students Thrashed By School Teacher | Sakshi
Sakshi News home page

విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు

Jun 20 2019 9:29 PM | Updated on Jun 20 2019 9:56 PM

Jammu Hostel Students Thrashed By  School Teacher - Sakshi

జమ్మూ కశ్మీర్‌ : ట్యూషన్‌కి ఆలస్యంగా వచ్చారని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులను చితకబాదాడు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లా గుజ్జర్ బకర్వాల్ బాయ్స్‌ హస్టల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..యాసిన్ అనే ఉపాధ్యాయుడు హాస్టల్‌ నుంచి ట్యూషన్‌కు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. గంటపాటు వారిని నిలబెట్టి కనికరం లేకుండా బెత్తంతో కొట్టాడు. దాదాపు 25 మందిని యాసిన్‌ చితకబాదినట్టు బాధిత విద్యార్థులు పేర్కొన్నారు. మాస్టర్‌ తమను ఇలా దండించడం తొలిసారి కాదని వారు తెలిపారు.

విద్యార్థులపై తాను చెయ్యి చేసుకున్నది నిజమేనని అంగీకరించిన యాసిన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని అధికారులు వెల్లడించారు. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement