మత్తులో నుంచి తేరుకోని ‘సంపర్క్‌ క్రాంతి’ బాధితులు | Investigation Of Railway Police On 'Sampark Kranti' | Sakshi
Sakshi News home page

‘సంపర్క్‌ క్రాంతి’ ఘటనపై రైల్వే పోలీసుల దర్యాప్తు

Jun 5 2018 1:43 PM | Updated on Jun 5 2018 1:43 PM

Investigation Of Railway Police On 'Sampark Kranti' - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కాజీపేట రూరల్‌ : సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఘటనపై రైల్వే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యశ్వంత్‌పూర్‌ నుంచి హజరత్‌నిజాముద్దీన్‌ వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఆరుగురి ప్రయాణికులకు దుండగులు మత్తు మందు కలిపిన తినుబండారాలు ఇచ్చి నిలువు దోపిడి చేయడం జరిగింది.

ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీస్‌ అధికారులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెంగళూర్‌ నుంచి సోమవారం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు ఇక్కడికి వ చ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఆరుగురు ప్రయాణికు ల పూర్తి వివరాలు, వారి చికిత్స విధా నం, వారి వివరాలను స్థా నిక రైల్వే పోలీస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స ంపర్క్‌క్రాంతి ఘటనపై దుండగులను పట్టుకునేందుకు అన్ని రై ల్వే జోన్లలో రైల్వే పోలీస్‌లను అప్రమత్తం చేసినట్లు వివరి ంచారు.

ఈ ఘటనపై కాజీపేట జీ ఆర్‌పి పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసుకుని.. కేసును బెంగళూర్‌ రైల్వేపోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. 

ఇంకా తేరుకోని ఆ ఆరుగురు.. 

సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు ఇంకా మత్తులో నుంచి తేరుకోలేదని రైల్వే పోలీస్‌ అధికారులు తెలిపారు. ఒకరు మత్తులో నుంచి తేరుకొని కొన్ని మాటలు మా ట్లాడినట్లు తెలిపారు. అతడి వద్ద ఉన్న రూ.4 వేలు దోచుకున్నారని.. మాత్రమే తెలిపినట్లు వెల్లడించారు. వారు మత్తులో నుంచి తేరుకుంటేనే వివరాలు తెలిసే అవకాశం ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement