భారత సంతతి మహిళ అనుమానాస్పద మృతి | Indian Origin Woman Was Found Dead In UK | Sakshi
Sakshi News home page

భారత సంతతి మహిళ అనుమానాస్పద మృతి

May 10 2018 9:58 PM | Updated on May 10 2018 10:44 PM

Indian Origin Woman Was Found Dead In UK - Sakshi

హత్యకు గురైన సరబ్‌జిత్‌ కౌర్‌

లండన్‌ : భారత సంతతికి చెందిన సరబ్‌జిత్‌ కౌర్‌(38) అనే మహిళ అనుమానాస్పదస్థితిలో హత్యకు గురైంది. ఈ విషయాన్ని పోలీసులు మూడు నెలల తర్వాత గుర్తించారు. కౌర్‌ భర్త గురుప్రీత్‌ సింగే గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఆయనపై కేసు నమోదు చేశారు. గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంగ్లాండులోని వాల్వర్‌హాంప్టన్‌ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోస్టుమార్టం నివేదికలో సరబ్‌జిత్‌ కౌర్‌ గొంతునులమడం వల్లే చనిపోయిందని తేలింది. హత్యకు గురైన ఇంటిలో కొన్ని వస్తువులు కూడా అదృశ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. సరబ్‌జిత్‌ కౌర్‌ ఇంటి ఆవరణలో హత్య జరిగిన రోజు అనుమానాస్పదంగా ఓ మహిళ సంచరించినట్లు పోలీసులు సీసీటీవీ కెమెరా ద్వారా గుర్తించారు. ఈ మేరకు అనుమానంగా సంచరిస్తున్న ఓ మహిళ చిత్రాలను కూడా మీడియాకు పోలీసులు విడుదల చేశారు. హత్య భర్త చేశాడా లేక అనుమానంగా సంచరించిన మహిళ చేసిందా అనేది మిస్టరీగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement