కాల్పులు జరిపిన వ్యక్తి గుర్తింపు

Hyderabad Police Found Accused In RTC Bus Firing Incident - Sakshi

హైదరాబాద్‌: పంజాగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్‌లో సెక్యూరిటీ వింగ్‌లో పని చేస్తోన్న శ్రీనివాస్‌ అనే గన్‌మెన్‌గా నిర్ధారణకు వచ్చారు. శ్రీనివాస్‌ ఓ ప్రముఖుడి దగ్గర గన్‌మెన్‌గా పనిచేస్తోన్నట్లు తెలిసింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కిన శ్రీనివాస్‌ ప్రయాణికులతో గొడవపడి కోపంలో కాల్పులకు పాల్పడ్డాడు.

అనంతరం బస్సు దిగి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణలో శ్రీనివాసే నిందితుడని తెలిసింది. శ్రీనివాస్‌ను కూకట్‌పల్లిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఏపీ పోలీసులకు హైదరాబాద్‌ పోలీసులు సమాచారం అందించారు. నిందితుడు ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన పోలీస్‌ కావడంతో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ఆరా తీశారు. జనాల మధ్య కాల్పులు జరపటం చట్టారీత్యా నేరమని వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ బస్సులో ఫైరింగ్‌ కలకలం..!
కాల్పులు జరిపిన వ్యక్తిని చూస్తే గుర్తుపడతా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top