థ్రిల్లర్‌ సినిమా కోసం నటి సంధ్య హత్య?

Husband Statement on Actress Sandhya Murder Case Tamil Nadu - Sakshi

చెన్నై  ,టీ.నగర్‌: నటి సంధ్య హత్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్‌ సినిమా రూపొందించేందుకు దర్శకుడు బాలకృష్ణన్‌ నిర్ణయించినట్లు సినీవర్గాలలో ఆదివారం సంచలన వార్తలందాయి. పెరుంగుడి చెత్తకుప్పలో ఇటీవల లభించిన నటి సంధ్య మృతదేహం విడిభాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ సంఘటనపై తీవ్ర విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.ఇలావుండగా సంధ్య మృతదేహాన్ని ఏడు భాగాలుగా కత్తిరించేందుకు అతని స్నేహితుడు ఒకరు చెప్పిన స్క్రీన్‌ప్లేనే కారణమని భావిస్తున్నారు. కాదల్‌ ఇలవశం పేరుతో చిత్రాన్ని నిర్మించిన బాలకృష్ణన్‌ అది పరాజయం పొందడంతో తీవ్ర నష్టాన్ని చవిచూశారనే విషయం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top