కదులుతున్న కారు నుంచి భార్యను తోసి హత్యాయత్నం చేసిన భర్త

Husband Murder Attempt on Wife in Tamil Nadu - Sakshi

హత్యాయత్నం చేసిన భర్త

వాట్సాప్‌లో వీడియో హల్‌చల్‌

అన్నానగర్‌: కోవై సమీపంలో కదులుతున్నకారు నుండి భార్యని తోసివేసి హత్య చేయటానికి యత్నించిన భర్త వీడియో వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తోంది. కోవై సమీపంలోని తుడియలూరు తొప్పంపట్టి గణపతి గార్డెన్‌ ప్రాంతానికి చెందిన ఆర్తీ(38). ఆమె భర్త అరుణ్‌జో అమల్‌రాజ్‌ ఒక ప్రైవేటు ఉద్యోగి. వీరికి 2008లో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనంతరం భార్యభర్తల మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడి 2014వ సంవత్సరంలో ఆర్తి పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. అనంతరం అరుణ్‌జో అమల్‌రాజ్‌ భార్యతో రాజీపడి భార్య, పిల్లలను ఇంటికి పిలుచుకుని వచ్చాడు. తర్వాత వారు కుటుంబంతో గత మే నెల 9వ తేదీ ఊటీ పర్యటనకు కారులో బయలుదేరారు. అప్పుడు దంపతుల మధ్య హఠాత్తుగా వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆవేశంలో అరుణ్‌జో అమల్‌రాజ్‌ ఆర్తీని కారు నుంచి తోసివేసి హత్య చేయటానికి ప్రయత్నించాడు. ఈ వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. సంఘటన గురించి తుడియలూరు పోలీసుస్టేషన్‌లో ఆర్తీ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top