రూ.50 లక్షల విలువైన గుట్కా పట్టివేత | Huge Amount Of Gutka Siezed In Balapur | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షల విలువైన గుట్కా పట్టివేత

Aug 24 2018 4:03 PM | Updated on Sep 26 2018 6:49 PM

Huge Amount Of Gutka Siezed In Balapur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నిషేధిత గుట్కా తయారు చేస్తోన్న కేంద్రంపై బాలాపూర్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

బాలాపూర్‌: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఉస్మాన్‌ నగర్‌ కేంద్రంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిషేధిత గుట్కా తయారు చేస్తోన్న కేంద్రంపై బాలాపూర్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు రూ.50 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా తయారీకి ఉపయోగించే మెషిన్‌తో పాటు సామగ్రి సీజ్‌ చేశారు.  పోలీసుల రాక గమనించి నిందితుడు తౌఫీక్‌ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement